Tummala nageswar rao: రాష్ట్రంలో విత్తనాల కొరతపై రాద్దాంతం
రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తనాల నిల్వలు సరిపడ ఉన్నాయని, విత్తనాల కొరత లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాల కుట్ర
సరిపడ విత్తనాలు నిల్వలు ఉన్నా యి, రైతులెవరూ ఆందోళన చెంద వద్దు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
వానాకాలం పంటలపై ప్రభుత్వ సన్నద్దతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చిన్నారెడ్డి భేటీ
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తనాల నిల్వలు సరిపడ ఉన్నాయని, విత్తనాల కొరత లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి(Dr. G. Chinnareddy) అన్నారు.
రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సీజన్ ( ఖరీఫ్ ) లో పండించాల్సిన పంటలపై ప్రభుత్వ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో(Agriculture Minister Tummala Nageswara Rao)రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి గురువారం చర్చించారు.
బంజారాహిల్స్(Banjara Hills)మంత్రుల అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో వానాకాలం వ్యవసాయ సీజన్ పై డాక్టర్ జీ చిన్నారెడ్డి మంత్రి తుమ్మలతో సుధీర్ఘంగా చర్చించారు. అన్ని రకాల పంటల సాగు కోసం వేయాల్సిన విత్తనాలు నిల్వలు సరిపడ ఉన్నాయని, విత్తనాల(Seeds) కొరతపై ప్రతిపక్ష పార్టీల నాయ కులు కుట్ర పూరితంగా వ్యవహ రిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగ జార్చేందుకు పన్నాగాలు పన్ను తున్నారని చిన్నారెడ్డి ఆరోపించా రు.జిల్లాల్లో రైతులకు(Farmers) విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వ్యవసాయ అధికారుల దేనని, ఎప్పటికప్పుడు పరిస్థితు లను సమీక్షించాలని చిన్నారెడ్డి సూచించారు.ఈ భేటీలో వ్యవ సాయ అధికారుల సంఘం జెఏసి చైర్మన్ బొమిరెడ్డి కృపాకర్ రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయ అధికారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
Tummala review on seeds shortage