ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లోవారం రోజుల క్రితం హోరా హోరీగా జరిగిన సొసైటీ కార్యవర్గ ఎన్నికల్లో తమ ప్యానల్ కు సంపూర్ణ మద్దతునిచ్చి, గెలుపు కు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJకు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువ ల్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నూతన బాధ్యులు. గురువారం ఈ మేరకు సొసైటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు గోపరాజు, రవీంద్ర బాబులు బషీర్ బాగ్ లోని టీయూ డబ్ల్యూజే కార్యాలయంలో యూని యన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహ త్ అలీని మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు.
తమపై సంఘం ఉంచిన విశ్వాసా న్ని వమ్ము చేయకుండా సొసైటీ సభ్యులకు న్యాయం చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తామని హామీ ఇచ్చారు. తమకు యూనియన్ సలహాలు, సహకారం అవసరమని వారు కోరగా, ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో పనిచేస్తూ ముందు కెళ్లాలని విరాహత్ అలీ వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ పాల్గొన్నారు.