Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TuwjPresidentAllamNarayana : రణనినాదంతో రజతోత్సవాలు

— మీడియా అకాడమీ మాజీ అధ్య క్షుడు, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్య క్షుడు అల్లం నారాయణ

TuwjPresidentAllamNarayana:ప్రజా దీవెన, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మ లిదశ ఉద్యమ పోరా టంలో 2001 లో పుట్టిన మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలం గాణ జర్నలిస్టు ల వేదిక అని, నాటి ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని సం ఘటితం చేసిన ఘ నత టీజెఎఫ్ దేనని ప్రెస్ అకాడమీ మాజీ అధ్య క్షుడు, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు అల్లంనారాయణ స్పష్టం చేసారు. ఆర్ ఎస్ యూ నుండి ఆర్ ఎస్ ఎస్ వరకు భిన్నమైన భావ జా లలతో కూడుకున్న సంస్థలను, తె లంగాణ రాష్ట్ర సాధన, అనే ఒక ఒ క కామన్ మినిమం ప్రోగ్రాం కింద సమన్వయం చేసి ఒకే వేది క మీద కూడగట్టిన చరిత్ర టీజెఎఫ్ ది అన్నారు. రాష్ట్ర సాధన దాకా పలు కీలక దశల్లో టీ జె ఎఫ్ పోషించిన చారిత్రక పాత్ర మహోన్నత మైనదని అన్నారు.

ఉస్మానియా కాకతీయ వంటి యూ నివర్సిటీ విద్యార్థులను ఉద్య మం లో సంఘటిత శక్తిగా సమన్వయ పరిచిందని అన్నారు. ఉద్యో గులు అడ్వకేట్ ఇంజనీర్లు వంటి అనేక వృత్తి సంఘాలు అందరినీ ఉద్య మంలో ఉద్యుక్తులను చేసిందన్నారు.సాంస్కృతిక సమాఖ్య వంటి అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలకు వే దికలందిస్తూ, తెలం గాణ కోసం గద్ద ర్ నిర్వహించిన శాంతి యాత్రను టీజెఎఫ్ కోఆర్డి నేట్ చేసిందనీ గుర్తు చేశారు. ఉద్యమ భావజాలాన్ని విస్తృతం చేసి న చరిత్ర టీ జె ఎఫ్ ద న్నారు. ప్రత్యేక రైలులో చలో ఢిల్లీ కి యాత్ర చేపట్టి, ఢిల్లీ లో ఉద్యమా న్ని సమన్వయం చేసిందనీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశానికి వినిపించిందనీ తెలిపారు.

వార్తలు రాస్తూ,కలం కవాతు చేస్తూ, ఆడియో వీడియో మాధ్య మాల ద్వారా కలం గళం వినిపిం చడమే కాకుండా పోలీసుల లాఠీ ఛార్జీ లను ఎదుర్కొని మిలిటెంట్ పోరాటాలు చేసిన చరిత్ర టీ జె ఎఫ్ ది అన్నారు. ఒక పక్క తెలంగాణ ను వ్యతిరేకించే ఆంధ్రా మీడియా యాజమాన్యాల వద్ద పని చేస్తూ తెలంగాణ వాదాన్ని కొనసాగిస్తూ అటు స్వీయ అస్థిత్వాన్ని ఇటు సమాజ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవ డం లో తెలంగాణ జర్నలిస్టులు చేసిన త్యాగం గొప్పదన్నారు.

తెలంగాణ అస్తిత్వ పోరాటం లో వరంగల్ జిల్లా టి జె ఎఫ్ పోషించి న పాత్ర గొప్పదన్నారు. ఇక్కడి నుంచే సునీల్ అనే జర్నలిస్టు ఆత్మ బలిదానం చేసిన బాధాకర ఘటనను అల్లం నారాయణ స్మరించు కున్నారు.ఉద్యమం సల్లపడ్డప్పుడల్లా కీల కంగా తట్టిలేపిందన్నారు. సుందర య్య విజ్ఞానకేంద్రం లో జరిపిన భా రీ బహిరంగ సభ ఆ సందర్భం గా జరిపిన భారీ ఊరేగింపు కలం క వాతు తెలంగాణ ఉద్యమ చరిత్ర లో నిలిచిపోయే ఘట్టాలన్నారు.కేసీఆర్ గద్దర్ లను ఒకేమీదికి తె చ్చి అలయ్ బలయ్ లను తీసు కొని తెలంగాణ ఉద్యమ శక్తుల ఐక్యతను చాటి ప్రజల్లో స్ఫూర్తిని రగిలించిన ఘన చరిత్ర టీ జె ఎఫ్ దేనన్నారు.

అదే విధంగా పలు రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు, మిలియన్ మార్చ్ సంద ర్భంగా పోలీసుల నిర్బంధాన్ని బద్దలు చేయడం, కేసీ ఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా ప లు కీలక సంఘాలతో సంఘీభావ స మావేశాన్ని నిర్వహించడం,మాక్ అసెంబ్లీ నిర్వహణ, మధ్యాహ్న భో జన విరామం అనంతరం జరిగిన రెండో సెషన్ లో అన్ని జిల్లాల నుం చి పాల్గొన్న అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ జర్నలిస్టులు మా ట్లాడారు. వారి అభిప్రాయాలను వినిపించారు.

పలు తీర్మానాలు… 2001 మే నెల 31 వ తేదీన ఆవిర్భవించిన టీ జె ఎఫ్.. 2025 మే 31 తేదీ నాటికి 25 ఏండ్లకు చేరుకుంటున్న నేప థ్యంలో రజతోత్సవాలను నిర్వ హించుకోవాలని రాష్ట్ర కార్యవర్గ స మావేశం నిర్ణయించింది.అందుకు చేపట్టవలసిన కార్యా చరణ, అ నుసరించవలసిన వ్యూహాలను ఈ సందర్భంగా పలు అంశాలను సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు.

హైదరాబాద్ వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని, ఏడాది పాటు వేడుకలు కొనసా గించాలని నిర్ణయించారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాలనుంచి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని సమావేశం పిలు పుని చ్చింది