— ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా
University of Delhi: ప్రజా దీవెన, హైదరాబాద్: పదేండ్లపాటు జైల్లో చీకటి జీవితం గడిపానని, తన తల్లి కడచూపునకూ నోచుకోలేదని పౌర హక్కుల నేత, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా (sai baba) అన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మా ట్లాడారు. పదేండ్ల తర్వాత తెలంగా ణలో స్వేచ్ఛగా మీడియాతో మాట్లా డుతున్నానని చెప్పారు. ఢిల్లీలో తనను పోలీసులు కిడ్నాప్ చేసి అక్రమం గా అరెస్టు చేశారని చెప్పా రు. వికలాంగుడినని కూడా చూడ లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. తన వీల్ చైర్ ను కూడా మహారాష్ట్ర పోలీసులు ధ్వంసం చేశారని అన్న రు. తనకు జైల్లో (jail) ఉన్న సమయంలో 21 రకాల ఆరోగ్య సమస్యలు పచ్చా యని చెప్పారు. జైలులోని అందా సెట్ లో ఓ ప్రత్యేకమైన రూంలో నిర్బం ధించారని అన్నారు. వీల్ చైర్ లో తిరగలేని పరిస్థితి క్రియేట్ చేశారని చెప్పారు. తన తల్లి (mother) చనిపోతే అంత్య క్రియలకు అనుమతి ఇవ్వలేదన్నారు. తాను దేశంలోని అన్ని కోర్టులకు లేఖలు రాశానని కోర్టులు కూడా న్యాయం చేయలేదని అన్నారు. నార్త్ ఇండియాలోని జైల్లలో కుల వ్యవస్థ విచ్చ లవిడిగా ఉంటుందని చెప్పారు. జైలు మాన్యు వల్ లో కులాన్ని బట్టి పని ఇస్తారని అన్నారు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ డాక్టర్లు చూడరని, కేవలం పెయిన్ టా బ్లెట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. తనను శా రీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులున్నారు.