–ప్రేమజంటను వేధించిన కేసులో చర్యలు
Uppal CI :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ప్రేమజంటను వేధించిన కేసులో నిందితుల పైన పిట్టి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ (demand) చేశారని ఆరోపణలో ఎస్ఐ శంకర్ పై (Shankar)చర్యలకు ఉపక్రమించింది పోలీస్ శాఖ. ఆయనను డీసీపీ ఆఫీసు కు అటాచ్ చెయ్యగా ఈ కేసులో నిర్ల క్ష్యంగా ఉన్నారని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి పై కూడ బదిలీ వేటు (Transferred )సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 19న ఉప్పల్ భాగయెత్ లో ప్రేమజంట రాత్రి సమయంలో కారు లో ఉండగా పీర్జాదిగూడ కార్పొరే టర్ తమ్ముడు అమర్ తొ పాటు మరో నలుగురు మారుతీ, ఉద య్,రామ్ చరణ్, శశవళిలు వారి వీడియోలు తీసి సోషల్ మీడియా లో (social media) పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆ యువ కుడు ఉప్పల్ సెక్టర్ ఎస్సై శంకర్ కు ఫిర్యాదు చేశాడు దీంతో పోకిరీలపై పీట్టి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో నింది తుల వద్ద డబ్బులు తీసుకొని వారికి సహకరించారని బాధితులు డిసిపి ని ఆశ్రహించారు. దీంతో నిర్లక్ష్యంగా ఉన్నారని ఉప్పల్ ఎస్సై శంకర్ తొ పాటు సీఐ ఎలక్షన్ రెడ్డి నీ ( Election Reddy)సీపీ కార్యాలయానికి (To CP office) బదిలీ చేశారు.