Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: రుణమాఫీ ఓ చరిత్ర..!

–ఇప్పటికివరకు రాని వారికి త్వరలోనే ఇస్తాం
–బీఆర్ఎస్, బీజేపీ నేతలవి పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు
— మీడియా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్:దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారం టూ ఆగ్రహించారు.

సోమవారం ఆయన హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఈ సంద ర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభు త్వం, తెలంగాణలో పదేళ్లు అధికా రంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతల ను ఏనాడూ పట్టించుకోలేదు. పకృ తి వైపరీత్యాలకు నష్టపోయిన రైతన్న లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరోజూ ఆదుకోలేదు. రుణమాఫీ చేతగాని గత ప్రభుత్వం మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఇంత వేగంగా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే. కొన్ని కారణాల వల్ల కొంతమందికి మాఫీ జగలేదన్నది వాస్తవం. వారి సమస్య త్వరలోనే పరిష్కరించి నగదు అందజేస్తాం. మాఫీ కాని రైతులను బీఆర్ఎస్, బీజేపీ నేతలు (BRS and BJP leaders) రెచ్చగొడుతున్నారు. వారిని ఉద్దేశపూర్వకంగా రోడ్లపైకి తెస్తున్నారు. ప్రతిపక్షాల మాటలను రైతులు వినొద్దు,త్వరలోనే మీకు పూర్తి రుణ మాఫీ చేస్తామన్నారు.

కాని వారికి అందుకే కాలేదు…
రెండుసార్లు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించిన గత బీఆర్ఎస్ ప్రభు త్వం (BRS Govt)మొదటి, రెండో దశలో చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకే సరిపో యింది. అలాంటి నేతలు ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. ఏ కారణం చేతనైనా రుణమాఫీ కాక పోతే త్వరలోనే అవుతుంది. రైతు లు కంగారు పడాల్సిన పనిలేదు. లక్షా 20వేల ఖాతాల ఆధార్ నెంబ ర్లు సరిగా లేకపోవడం వల్ల ఆ రైతు లకు రుణమాఫీ ఆగింది. అలాగే లక్షా 61వేల అకౌంట్లకు ఆధార్, పాస్ బుక్ పేర్లు వేర్వేరుగా ఉన్నా యి. లక్షా 50వేల ఖాతాల్లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి. 4లక్షల 83వే ల అకౌంట్లకు రేషన్ కార్డు వెరిఫికేష న్ చేయాల్సి ఉంది. మరో 8లక్షల అకౌంట్లకు రూ.2లక్షల కంటే ఎక్కు వ రుణాలు ఉన్నాయి. వీటంన్నింటి ని పరిష్కరిస్తాం. రూ.2లక్షలపైన రుణాలు ఉన్న రైతులు పైమొత్తం చెల్లించిన తర్వాత వారికి రుణమా ఫీ అవుతుంది. సమస్యల పరిష్కా రానికి అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్హత ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ జరుగుతుంది” అని చెప్పారు.