Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు

— 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రా ల ఏర్పాటు
— సన్నాలకు,దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు
— ఖరీఫ్ లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో సాగు
–146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
–91 లక్షల 28 వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళిక
–మొట్టమొదటి సారిగా 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్ ల ఏర్పాటు
— డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ది లేదు
–సరిహద్దు రాష్ట్రలనుండి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా ఉంచాలి
–ఖరీఫ్ నుండి సన్నాలకు 500 బోనస్
–ఖరీఫ్ లో సేకరించిన సన్నాలతో జనవరి నుండి చౌక ధరల దుకా ణాలలో సన్న బియ్యం పంపిణీ
–రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మం త్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు.అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంగాల ద్వారా 4,496,ఐ.కే.పి కేంద్రాల ద్వారా 2102,ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను (Purchase Center) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి (Marri Chenna Reddy)మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్.చవాన్, జాయింట్ సెక్రటరీ ప్రియ్యంకా అలా,స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ యం.డి.లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ ఖరీఫ్ లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో సాగు జరిగిం దన్నారు.ప్రభుత్వ అంచనా ప్రకారం 91 లక్షల 38 వేల మెట్రిక్ టన్నుల లక్షల దిగుబడి ఉండొచ్చని ఆయన తెలిపారు.సన్నాలు,దొడ్డు వడ్లు వేరు వేరు కేంద్రాలలో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ న్నారు.అందులో 36 లక్షల 8 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తే 88 లక్షల 9 వేల వరకు సన్నాల దిగుబడి ఉంటుందని,అదే విదంగా 23 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేస్తే 58 లక్షల 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవకాశాలు ఉన్నాయి అన్నారు.గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో అవకతవకలకు తావునియ్యద్దని ఆయన అధికారులకు సూచించారు.

సరిహద్దు రాష్ట్రల నుండి ధాన్యం దిగుమతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి వచ్చిందన్నారు.36 లక్షల 80 వేల ఎకరాల్లో సన్నాలు సాగు అయ్యాయన్నారు.రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని సన్నాల వైపు ప్రోత్సాహించేందుకు వీలుగా 500 బోనస్ ను అందిస్తున్నామన్నారు.ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ (Kharif) నుండే సన్నాలు క్వింటా ఒక్కింటికి 500 బోనస్ నందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.అక్టోబరు మొదటి వారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి మాసంతానికి కోన సాగుతాయన్నారు.అందుకు సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు.

మొదటివారంలో నల్లగొండ, మెదక్, రెండవ వారంలో నిజామాబాద్,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణపేటలని ఆయన వివరించారు.అదే విధంగా మూడవ వారంలో కరీంనగర్, జగిత్యాల,వరంగల్ జనగామ,సూర్యాపేట, మేడ్చల్ లు ఉంటాయన్నారు.నాల్గవవారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి ,హన్మకొండ లు ఉండగా నవంబర్ మొదటి వారంలో నిర్మల్ ,సిద్దిపేట, రంగారెడ్డి,రెండో వారంలో కొనరం భీం ఆసీఫాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల,వనపర్తి లు ఉన్నాయన్నారు.

మూడో వారంలో భూపాలపల్లి,ములుగు,ఖమ్మంలు నాలుగో వారంలో మహబూబాబాద్,వికారబాద్,ఆదిలాబాద్ లు ఉన్నాయన్నారు.మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు వీలుగా గోడౌన్ లను సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.ఖరీఫ్ లో సేకరించిన సన్నాలను జనవరి నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాలలో సన్న బియ్యం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.ధాన్యం కొనుగోలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.దీనితో సుమారు మూడు కోట్ల మందికి లబ్ది చేకూరునున్నట్లు ఆయన చెప్పారు.మనిషి ఒక్కింటికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.