Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు, నీటి పారుదల శాఖలో బదిలీలు పదోన్నతులు

–నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నీటిపా రుదల శాఖలో జనవరి మాసాంతా నికి పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్,ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సి జెనరల్ అనిల్ కుమార్,ఇ. ఎన్.సి ఓ&యం విజయభాస్కర్ రెడ్డి లతో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇంతకాలంగా న్యాప రమైన అడ్డంకులు ఉన్నందునే జాప్యం జరిగిందని వాటిని అధిగ మించేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో తెలంగాణ ఏ.ఇ.ఇ ల అసోసియేషన్ రూపొం దించిన 2025 డైరీని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణా రాష్ట్రంలో దశాబ్దా కా లంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పుల కు,వడ్డీలకే 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిం దన్నారు. గడిచిన ప్రభుత్వం ఎక్కు వ ఖర్చుచేసి తక్కువ ప్రయోజనం పొందిందని, ఆ ఫలితం ఇప్పుడు రాష్ట్ర పర్సభుత్వానికి భారంగా పరిణమించిందన్నారు. అటువంటి నీటిపారుదల శాఖాను సంవత్స రకాలంగా గాడిలో పెడుతు న్నామన్నారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. మానవ వనరు లు,మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

సంవత్సరం వ్యవధిలో 700 ఏ.ఇ. ఇ లను నియమించడంతో పాటు 1800 మంది లష్కర్ లను నియ మించామని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి తెలిపారు. మరో 1300 ఉద్య గాల నియమాకాలకై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతి చ్చామన్నారు.యావత్ భారత దేశంలోనే ఇక్కడి నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంద న్నారు.ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణా ప్రాంతంలోను ఇక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు నిర్మించారన్నారు.ఆధునిక దేవాల యాలుగా బాసిల్లిన నాగార్జు నసాగర్,శ్రీరాంసాగర్,శ్రీశైలం వంటి ప్రాజెక్ట్ లను మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి ఉదహరించారు.

అటువంటి ఇంజినీర్లకు యువ ఇంజినీర్లు వార సత్వంగా ఎదగాలని ఆయన ఉద్బోధించారు.విధినిర్వహణలో సిన్సియారీటీ, నిబద్ధత, పారద ర్శకత కనిపించాలని అటువం టప్పుడే ఉన్నత స్థానానికి ఎదు గుతారని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణా లోనూ నీటిపారుదల శాఖా అత్యం త ప్రతిష్టాత్మకమైనదన్నారు.

అటువంటి శాఖా ప్రతిష్ఠతను నిలిపేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్య క్రమంలోఇ. ఎన్.సి అనిల్ కుమా ర్,హరేరాం, డిప్యూటీ ఇ. ఎన్.సి కే. శ్రీనివాస్ లతో పాటు అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శు లు బండి శ్రీనివాస్, నాగరాజు, TGO అధ్య క్ష,కార్యదర్శులు ఏలూరి శ్రీనివా సరావు, సత్యనారాయణ ,సంఘం నేతలు సమర సేన్,సంతోష్ తది తరులు పాల్గొన్నారు.