Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: నెల్లికల్లు ఎత్తిపోతలకు లైన్ క్లియర్

–భూసేకరణ ఎలాంటి ఇబ్బందు లు అడ్డుకాకూడదు
— ఏప్రిల్ మాసంతానికి భూసేకరణ పూర్తి చెయ్యండి
–భూసేకరణ అంశంలపై రైతులతో త్వరితగతిన సంప్రదింపులు చేపట్టాలి
–అటవీ భూములకు చెల్లించాల్సిన అదనపు చెల్లింపులకు ప్రతిపాదన లు సిద్ధం చెయ్యoడి
–భారీ నీటిపారు గల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ ని యోజకవర్గం పరిధిలోని నెల్లికల్లు ఎత్తిపోతల పధకం పై సచివాల యంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.హాజరైన నల్లగొండ లోకసభ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి (Nalgonda Lok Sabha Member Kunduru Raghuveer Reddy,),నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయదీర్ రెడ్డి,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తదితరులతో పాటు పాల్గొన్న ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్,కలెక్టర్ నారాయణ రెడ్డి,సి.ఇ లు అజయ్ కుమార్, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి (Nellikallu Uplifts Scheme) భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ఎప్రియల్ మాసం తానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించా రు.గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో నెల్లికల్లు ఎత్తిపో తల పథకం పురోగతి పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ లోకసభ సభ్యుడు కుం దూరు రఘువీర్ రెడ్డి,శాసనస భ్యు లు కుందూరు జయదీర్ రెడ్డి ,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి లతో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్,నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,చీఫ్ ఇంజినీర్లు అజయ్ కుమార్,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ విష యమై రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే సమయంలో అటవీశాఖ భూ ముల కు అదనంగా చెల్లించాల్సిన చెల్లిం పుల విషయమై ఆయన ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన ప్రతిపా దనలము వెంటనే పూర్తి చేయాల న్నారు.పెండింగ్ (penidng)లో ఉన్న 23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతి పాదనలు తక్షణమే పంపాలని ఆయన అధికారులకు చెప్పారు.

అదే విదంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ (Nagarjunasagar Constituency) పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు తీసుకోవడంతో పాటు మొత్తం ఐదు చెక్ డ్యామ్ లకు తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.ఏ.యం.ఆర్.పి పరిధిలోని లో లెవల్ కెనాల్ లో జంగిల్ కటింగ్ వెంటనే మొదలు పెట్టాలని ఆయన చెప్పారు. దాంతో పాటుగానే యన్.యస్.పి కెనాల్ పరిధిలో ఉన్న మరమ్మతులను గుర్తించి వెంటనే పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు.