Varalakshmi Vratam: ప్రజా దీవెన, హైదరాబాద్: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) సందర్భం గా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయా ల్లో భక్తులు ప్రత్యేక పూజలు (Special Pujas) చేశా రు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాద్రాది, భద్రాద్రి ఆలయాల్లో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నా యి. భద్రాద్రి ఆల యంలో లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్ర మాలు చేశారు. కొత్త పేట్ అష్టలక్ష్మి టెంపుల్ లో మహిళలు కుంకుమా ర్చన చేశారు. మెదక్ జిల్లా ఏడుపా యల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చ కులు వర్గదుర్గమాతను తామరపు ష్పాలతో అలంకరించారు.
నకిరేకల్ లో … నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం (Vemula Viresham)దంపతులు వరలక్ష్మి వత్రం సందర్భంగా నకిరే కల్ పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మ వారి ఆలయం,చిట్యాల పట్టణం లోని శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.