Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Venkat Swamy:బిజెపికి ఎనిమిది సీట్లివ్వడం వృధా ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

Venkat Swamy:ప్రజా దీవెన, నకిరేకల్: ఎన్డీఏ (nda)కూటమి ప్రభుత్వం ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం తీవ్రమైన ఆవేదనకు ఆందోళనకు గురిచే స్తుందని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి (Venkat Swamy) అన్నారు. తెలంగాణ ప్రజలు 17 మంది పార్లమెంట్ సభ్యు (Members of Parliament)లలో 8 మందిని బిజెపి సభ్యులుగా పంపించినా కూడా మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటా యించడంలో పరిగణలోకి తీసుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిని రాష్ట్ర ప్రజలు ఓడించడం లేదా విస్మరించడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం యొక్క ఔన్నత్యం నిలబ డుతుందన్నారు.2024 కేంద్ర ప్రభు త్వ బడ్జెట్లో 48 లక్షల కోట్ల రూపా యల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, సుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు తప్ప.

రైల్వే మార్గాలు, విమానయా న కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వ నిర్వహ ణ రంగాలు (Railway lines, aviation hubs, central government sectors), వీటన్నింటినీ నిధులలే మితో దెబ్బతీశారని, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడంలో కేంద్రం ఎటువంటి బాధ్యతను తీసుకోవడం లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఎటు వంటి స్థానాలు లేకుండా చేయడం వలన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అట్టడు గున ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల కోసం, వారి యొక్క వలసల ను నివారించడం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనుల ను నిర్వీర్యం చేసిందని ఆరోపిం చారు.ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అన్నింటిని విస్మరించిందని, ఇది సంపన్న వర్గాలను ధనాధ్య వర్గాలకు కొమ్ము కాసిందని, మోదీ పేరుకు మాత్రమే మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అని చెప్పడం విస్మ యాన్ని కలిగిస్తోందని చెప్పారు.

అమరావతి టు హైదరాబాద్, విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు(Amaravati to Hyderabad, Vijayawada to Hyderabad, Hyderabad to Bangalore) పారి శ్రామిక కేంద్రాలుగా మారుస్తామని చెప్పడమే తప్ప స్పష్టమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కేంద్ర బడ్జెట్లో చేయలేదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions of Parliament)ముగింపు నాటికి స్పష్టమైన కేటాయింపులు చేయా లని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లిన 17 మంది పార్లమెంట్ సభ్యులు ఏకోన్ముఖం గా, పార్టీలతో నిమిత్తం లేకుండా, పార్లమెంటును నడవనీయకుండా చేయడం, స్తంభింప చేయడం ద్వా రా తెలంగాణ రాష్ట్రానికి నిధులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం తన యొక్క సొంత అస్థిరత్వం నుండి బయటపడడానికి ఆంధ్ర ప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు భారీ కేటా యింపులు చేశారు. భారతదేశం (india) అంటే కేవలం ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాలు వాటి సీట్ల వరకే పరిమి తమై ఆలోచన చేస్తుందని విమర్శించారు. ఒక దేశం, ఒక పన్ను అని తెచ్చిన జీఎస్టీ వలన తీవ్రమైన వసూల్లు చేస్తూనే, మరొక వైపున కేంద్ర ప్రభుత్వ పన్నులు రాష్ట్ర ప్రభుత్వ పన్నులతో సాధార ణ ప్రజల మేడలు పగులుతున్నా యని, ఈ స్థితిలో ఒకే దేశం ఒకే ప న్ను అనే జీఎస్టీ కి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే, ప్రస్తుతం ప్రజలపై వేస్తున్న పన్నులను ఉపసంహరిం చాలని, లేకపోతే వీటిపైనే భవిష్య త్తులో ప్రజలు పోరాడవలసి వస్తుం దని ఆయన హెచ్చరించారు.