Village Revenue Assistants: ప్రజా దీవెన, హైదరాబాద్: మహాత్మ జ్యోతిబా ఫూలే(Mahatma Jyotiba Phule) ప్రజాభ వంలో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ (Village Revenue Assistants)(వీఆర్ ఏ) లు తరలివచ్చారు.61 సంవత్స రాలు పైబడిన 3,797 మంది విఆర్ఏ వారసులకు కారుణ్య నియామకం కోసం జారీ చేసిన జీవో నంబర్లు 81, 85 లను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏ లు ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ మోడల్ అధికారి దివ్య (State Model Officer Divya) లను కోరారు.
వి ఆర్ ఏ ల సమస్యలను చిన్నారెడ్డి దివ్య సానుకో ఓపికగా విని సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమం త్రితో పాటు సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని, సమస్యల పరిష్కా రం కోసం చర్యలు తీసుకుంటా మని వారు హామీనిచ్చారు.
కాగా యూరోపియన్ దేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని బంజారాహిల్స్ కు చెందిన ఓ కన్సల్టెన్సీ తమను తమ వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిందని బాధితులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై తక్షణం స్పందించిన చిన్నారెడ్డి (Chinnareddy) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు ప్రత్యేకంగా లేఖ రాసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 906 దరఖాస్తులు అందాయి. గృహనిర్మాణ శాఖ కు సంబంధించి 306, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 138, విద్యుత్ శాఖ (Department of Electricity) కు సంబంధించి 138, మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 134, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించి 130, ఇతర శాఖలకు సంబంధించి 192 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
