Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Visa: దసరా ధమాకా…ఎట్టకేలకు వర్శిటీలకు వీసీలు

Visa: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం యూనివర్సిటీలకు (Government Universities)కొత్త వీసీల (visa)నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరా నాటికి వీసీల నియామక ప్రక్రియ పూర్తికా నుంది. కొత్త వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ (search)కమిటీల సమావేశాలు అక్టోబర్ 3నుంచి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం 3, 4 తేదీల్లో షెడ్యూల్ ఖరారు చేసింది.బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్సిటీ (Triple IT, Women’s University)మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 10యూనివర్సిటీలకు ప్రభుత్వం గతంలో సెర్చ్ కమిటీలను నియ మించింది. ఆయా యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖా స్తులను ఈ కమిటీలు పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేస్తాయి.కాగా, 10వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకు న్నారు. మార్చి 21తో వీసీల పదవీ కాలం ముగియగా ప్రస్తుతం అన్ని యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీ లుగా ఐఏఎస్‌లు వ్యవహరి స్తున్నారు.