Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

central ministers : మంత్రి వర్గాల్లో రేసు గుర్రాలు ఎవరో…!

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఏర్పడనుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.

విస్త్రుత స్థాయిచర్చనీయాoశంగా కేంద్ర మంత్రులుగా అవకాశం
కేంద్ర కేబినెట్ రేసులో ఆశావాహు లుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు
రాష్ట్రానికి రానున్న పదవుల సం ఖ్య ఎన్ని అంటూ చర్చోపచర్చలు

ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ(Narendra Modi)నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఏర్పడనుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections)రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి విజయం సాధించిన వారంతా కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారు. గతంలో కంటే బీజేపీకి సీట్లు తక్కువ రావడంతో లోక్ సభలో పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయింది. ప్రస్తుతం 241 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో అధి కారం చేపట్టాలంటే ఎన్డీఏలోని(NDA) పక్షా ల మద్దతు తప్పని సరి అయ్యింది, సహకరిస్తేనే సర్కారు మనుగడ ఏర్పడనుంది. కాగా ఇది ఇలా ఉం టే తెలంగాణ రాష్ట్రంలో మరో, చర్చకు దారి తీస్తున్నది. రాష్ట్రానికి ఎన్ని మంత్రిపదవులు దక్కుతాయ నేది రాజకీయంగా చర్చానియామ శంగా మారింది.

తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలుపొందిన 8 మందికి 8 మంది కూడ మంత్రిపదవి రేసు లో ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసిన, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(BJP State Chief Kishan Reddy)సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. పార్టీ విజయానికి కృషి చేయడంలో కీలక పాత్ర పోషించడం, అపార మైన రాజకీయ అనుభవం, మంత్రి గా పనిచేసిన ఎక్స్ పీరియన్స్ కోటా లో ఆయన మంత్రిపదవిని ఆశిస్తు న్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహిళా, సీనియారిటీ కోటాలో కేబి నెట్ రేసులో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ ను ఓడించగలి గానని ఆమె క్లెయిమ్ చేసుకుంటు న్నారు. అయితే ఏపీ నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గు బాటి పురంధేశ్వరి 2,39,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహిళకు ఇవ్వాల్సి వస్తే పురంధేశ్వరీ(Purandheswari), డీకే అరుణలో ఎవరో ఒకరికి దక్కుతుం దనే చర్చ కూడా నడుస్తోంది.

మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి 3,91,475 మెజార్టీ సాధించి ఈటల రాజేందర్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. అపారమైన రాజకీయ అనుభవం ఉండడం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, బీజేపీలో జాయి నింగ్స్ కమిటీ కన్వీనర్ గా పనిచే శారు ఈటల రాజేందర్. ఆయన ఈ సారి కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నా రు. బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ నుంచి రెండో సారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్(Bandi Sanjay)కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలు అందించడంతో పాటు తన వాగ్ధాటి, సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న సంజయ్ కేంద్ర మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూ లాలు కలిగిన సంజయ్ సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా రెండోసారి గెలు పొందిన ధర్మపురి అర్వింద్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు.

రాజకీ య అనుభవం ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో రెండో సారి ఎంపీగా గెలుపొందడం తనకు కలిసి వస్తుందనే ధీమాలో అర్వింద్ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి గెలుపొందిన గోడెం నగేశ్ కూడా ఎస్టీ కోటాలో కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నగేశ్ ఎన్టీఆర్ మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. సామాజిక వర్గ కూర్పు, అపారమైన రాజకీయ అనుభవం తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారు.2014 లో బీఆర్ఎస్ తరఫున కొండా విశ్వశ్వర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 2019లో టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం, తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం, ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు కలిసి వస్తాయని కొండా భావిస్తున్నారు. మెదక్ నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు కూడా కేంద్ర కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకు న్నారు.

తెలంగాణ ఉ ద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రఘునందన్ రావు(Raghunandan Rao)దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రఘునందన్ రావుకు హైకోర్టు న్యాయవాదిగా, వాగ్ధాటి ఉన్నరాజకీయ నాయకుడిగా పేరుం ది. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని భావిస్తున్న రఘునందన్ రావు కేంద్ర మంత్రి వర్గంలో చోటుపై ఆశలు పెట్టు కున్నారు. ఎన్డీఏ సర్కారుకు అరకొర మెజార్టీ రావడం వల్ల కచ్చి తంగా మిత్రపక్షాల మీద ఆధార పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు వీలైనన్ని ఎక్కువ మంత్రిపదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఏపీలో గెలిచిన టీడీపీ, జనసేన, నీతీశ్ నేతృత్వంలోని జేడీయూ తదితర పార్టీలు మంత్రి పదవులను ఆశించే అవకాశం ఉoది. ఈ నేప థ్యంలో తెలంగాణకు(Telangana) ఎన్ని మంత్రి పదవులు వస్తాయన్నది చర్చనీ యాంశంగా మారింది. ఈ పరిణా మాల నేపథ్యంలో కేంద్ర మంత్రిగా అనుభవం ఉన్న కిషన్ రెడ్డికి మాత్ర మే అవకాశం ఇచ్చి చేతులు దులు పుకొంటారా ఆయనతో పాటు ఇంకా ఎవరికైనా ఇస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Who is central ministers