–మద్యపానంతో ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం
–2019లో ప్రపంచ వ్యాప్తంగా26 లక్షల మరణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక
ప్రజా దీవెన,హైదరాబాద్: మద్యం పానం (Drinking alcohol) ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలకు కారణమవుతోంది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్టు ఆన్ అల్కాహాల్ అండ్ హెల్త్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ యూజ్ డిజార్డర్’ (Global Status Report on Alcohol and Health and Treatment of Substance Use Disorders’)పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మ ద్యం వినియోగానికి సంబంధించి 2019 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి సేకరించిన గణాంకాల ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో (who) ఈ నివేదిక రూపొందిం చింది. దీని ప్రకారం 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది ఆల్కహాల్ (Alcohol), మాదక ద్రవ్యాల వినియోగ రుగ్మతతో జీవిస్తున్నారు. వీరిలో 20.9కోట్ల మంది మందు బాబులు ఉన్నారు. మద్యపానం వల్ల కలిగే అనారోగ్యాల వల్ల 2019 లో ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల్లో 20 లక్షల మంది పురు షులే ఉండడం గమనార్హం. అంతే కాక, మరణించిన వారిలో 20–39 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారు. భారత్ విషయానికొస్తే 2019 నాటికి దేశ జనాభాలో 31 శాతం మంది మద్యపానం చేసే వారున్నారు. దేశంలోని పురుషుల్లో 40.9 శాతం మంది, మహిళల్లో 20.8 శాతం మంది మద్యపానం చేసేవారున్నారు. మద్యపానం వల్ల మరణించిన వారి సంఖ్యలోనైతే భారత్ (india) ఏకంగా చైనాను అధిగ మించింది. భారత్‌లోని ప్రతీ లక్ష మంది జనాభాలో 38 మంది మ ద్యం వల్ల మరణిస్తే చైనాలో ఈ సంఖ్య కేవలం 16గా ఉంది. కాగా, మద్యం మత్తులో వాహనాలు నడ పడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదా ల్లో ప్రపంచవ్యాప్తంగా 2.98 లక్షల మంది మృత్యువాత పడ్డారు. కాగా, 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా తలసరి మద్యం వినియోగం 5.5 లీటర్లు(ఏడాదికి ఒక వ్యక్తి తాగే మద్యం)గా ఉంది. భారత్‌లో ఇది 4.9 లీటర్లుగా ఉండగా 2030 నాటికి అది 6.7 లీటర్లకు చేర నుందని డబ్ల్యూహెచ్‌వో (who)అంచనా వేసింది.