World Rice Conference: హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు
హైద రాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సద స్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు.
పాల్గొన్న మంత్రి తుమ్మల, 20 దేశాల ప్రతినిధులు
ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సద స్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల పా టు జరిగే ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన్నాయి. శాస్త్ర వేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల(Rice Millers Associations) ప్రతినిధులతోపాటు 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపు పై చర్చించనున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్, ఆహార భద్రత లక్ష్యా లుగా ఈ సదస్సులో మేధోమథనం జరుగనుంది.
వరి ససదస్సు సంతోషదా యకం.. తెలంగాణ(Telangana) నూతనంగా ఏర్పడిన రాష్ట్రమని, ఇటీవలే దశాబ్ది ఉత్స వాలు సైతం జరు పుకున్నామని మంత్రి తుమ్మల చెప్పారు. రాష్ట్రం లో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రా ష్ట్రం అగ్రగామిగా ఉందని వెల్లడిం చారు. తెలంగాణలో క్రమంగా ధా న్యం ఉత్పత్తిపెరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు. ఆహార భద్రతకురాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుంద న్నారు. అందరికీ ఆహార భద్రత(Food security) కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
World Rice Conference in Hyderabad