Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yusuf Babu: టీయూడబ్ల్యూజేతోనే చిన్న పత్రి కల మనుగడ

–తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

Yusuf Babu: ప్రజా దీవెన, హైదరాబాద్ : టీయూ డబ్ల్యూజే ఐజేయూతోనే చిన్న పత్రి కల మనుగడ సాధ్య మని తెలం గాణ స్మాల్ మీడియం న్యూస్ పేప ర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియే షన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు (Yusuf Babu) అన్నారు. నిరం తరం జర్న లిస్టుల సంక్షేమం కోసం పరితపిస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తూ చిన్న పత్రికల మనుగడకు కొండంత అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) (TWJ)సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం ఉందన్నారు. బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లాకు చెందిన 10 మంది సీని యర్ చిన్న పత్రికల సంపాదకు లు , 143, ఇతర సంఘాలకు రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో యూసుఫ్ బాబు సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూకి అనుబంధ సంఘమైన తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ (Journalist)లోకానికి మార్గదర్శకులు, ఐజే యూ జాతీయ అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీని వాస్ రెడ్డికి మన సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం,చిన్న పత్రి కల పక్షపాతిగా ఉన్న మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ సహకారం ఉన్నందువల్ల మన పత్రి కలు మరింత పురోగతి సాధిస్తాయ న్నారు. ఇటీవల జరిగిన టీయూడ బ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో తెలంగాణ జర్నలిస్ట్స్ అటాక్స్ కమిటీ (Telangana Journalists Attacks Committee)సభ్యులుగా ఐజేయూ జాతీ య కౌన్సిల్ సభ్యులు, మన సం ఘం రాష్ట్ర నాయకులు దాస్ మా తంగిని నియమించడం అభి నందనీయమన్నారు. జాతీయ, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలుపుతూ అసోసియేషన్ పక్షాన మాతంగి దాస్ ని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఇదే ఉత్సాహం, సమిష్టి కృషితో మన సమస్యలు పరిష్కరించుకొనే దిశ గా సాగుదామన్నారు. కలసి ఉంటే కలదు సుఖమన్న చందంగా మనం దరం ఒకే గొడుగు కిందికి రావడం శుభపరిణామమన్నారు. సంఘం లో చేరిన ప్రజా సౌమ్యం సంపాదకు లు వెన్నమళ్ల రమేష్ బాబు, వార్తా ప్రవాహం ఎడిటర్ వేమిరెడ్డి సుభా ష్ రెడ్డి, వేముల ఎక్స్ ప్రెస్ ఎడిటర్వేముల వెంకన్న, పురపాలక దీపిక ఎడిటర్ సంద్యాల విద్యాసాగర్, కీర్తీ వాయిస్ ఎడిటర్ మధు, అన్వేషి సంపాదకులు అన్నెబోయి న మట్టయ్య, స్టూడెంట్ లైఫ్ ఎడి టర్ బి. బుచ్చయ్య, గిరిజన సం స్కృతి ఎడిటర్ ధర్మానాయక్ తది తరులు సంఘం తీర్థం పుచ్చుకు న్నారు.అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి అజం ఖాన్,రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ , వెంకటయ్య, కలకొండ రామకృష్ణ, అహ్మద్ అలీ, మక్సూద్ , యాదయ్య , చంద్ర శేఖర్, కొమరాజు శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే చిన్న మధ్యతరహా పత్రికల ప్రధాన సమస్యలైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేశన్ కార్డులు, అప్ గ్రేడింగ్, యాడ్ లు, బిల్లులు తదితర అంశాలపై చర్చించి తగు కార్యాచరణతో ముందుకు సాగుటకు నిర్ణయించనైనది.