ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంటూ మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
2019 – 2022 మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్‌టీ బకాయిలు రూ.401.70 కోట్లుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన వడ్డీ, పెనాల్టీ కింద మరో రూ.401. 70కోట్లు చెల్లించాలని ఆదేశిం చింది. దీంతో జొమాటో యాజ మాన్యం ఖంగుతింది.