నల్లగొండలో నిరుపేదలకు ఇంటి స్థలాలు
—
సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ పట్టణంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎన్నికలలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఇంటి స్థలం లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్న నిరుపేదలు పెద్ద ఎత్తున నల్లగొండ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ భూములను నామమాత్రం రేటుతో పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు ఇస్తున్న ప్రభుత్వం కడుపేదరికంతో జాగడు స్థలం లేక ఆత్మ అభిమానం చంపుకొని జీవిస్తున్న నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని అన్నారు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మాయమైతున్న జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ పేదవాళ్లకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
నల్లగొండ లో 33 సర్వేనెంబర్ ప్రభుత్వ భూములు పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము కొంతమందికి మాత్రమే డబల్ బెడ్ రూములు కాకుండా అందరికీ అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూములు ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది నిరుపేదలు సంవత్సరాల తరబడి దరఖాస్తులు పెట్టుకున్న పరిష్కారం కావడం లేదు వెంటనే నిరుపేదలకు ప్రభుత్వ భూములలో పట్టాలు ఇచ్చి గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి, గాదెపాక రమేష్, వి లెనిన్ పి సుజాత ఎస్బి గౌస్య షార్బీ రా నర్మదా విజయ నసత్ బేగం ఫాతిమా నీలా సుజాత రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.