పొరపాట్లకు తావు లేకుండా శుద్దీకరించిన ఓటరు జాబితా
నల్లగొండ: పొరపాట్లకు తావు లేకుండా శుద్దీకరించిన ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.
మంగళ వారం జిల్లా కలెక్టర్ అర్.డి. ఓ.లు, మండలాల తాసిల్దారులతో ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై, 13 నాటికి డబల్ ఒటర్లు, చనిపోయిన వారు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేయాలన్నారు. . జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు.
బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు అందరూ విధులలో చురుకుగా పనిచేసేలా చూసుకోవాలని తాసిల్దార్లకు సూచించారు.బి.ఎల్. ఓ .లు,సూపర్వైజర్ లు మార్పులు వుంటే ప్రతిపాదనలు కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారికి పంపి తుది జాబితా ఆమోదం పొందాలని అన్నారు. బిఎల్ఓల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ప్రతి బిఎల్ఓ దగ్గర కొత్తగా రూపొందించిన ఓటరు జాబితా లిస్టుతో పాటు బిఎల్ఓ రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. ఇంటింటి సర్వే ను పకడ్బందీగా నిర్వహించి పూర్తి చేయాలని, ఈ ఆర్ ఓ నెట్ ఆన్లైన్ సేవలు జూలై 13 వరకు మాత్రమే పనిచేస్తుందని, ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించుకొని పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ జాబితా లో ట్రాన్స్ జెండర్ లు ఎంత మంది నివసిస్తున్నారు పరిశీలించి మార్క్ చేయాలని అన్నారు.
అర్హత గల అంగవైకల్యం కల వారు ఓటర్ గా నమోదు అయ్యారా లేదా పరిశీలించి ఓటర్ జాబితా లో ఫాం 8 ద్వారా మార్క్ చేయించాలని తెలిపారు. నూతన ఓటర్ గా నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేయించాలని అన్నారు
తహశీల్దార్ లు పోలింగ్ కేంద్రాలు కనీస వసతులు 5 రోజుల్లో పరిశీలించాలని అన్నారు.పోలింగ్ కేంద్రాలు రేషనలై జేషన్ నిబంధనలు అనుసరించి చేయాలని,ఒక కుటుంబం లో వారు ఒకే పోలింగ్ కేంద్రం లో ఓటు వేసేలా ఉండాలని అన్నారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం లు నిర్వహించి
ఓటర్ జాబితా చేరికలు, తొలగింపులు అంద చేయాలని, మినిట్స్ రికార్డ్ చేయాలని సూచించారు.
రాబోవు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తహాసిల్దారులు అందరూ పూర్తి బాధ్యతతో పని చేయాలని ఆదేశించారు.ఈ వి.సి.లో డి.అర్.డి. ఓ కాళిందిని, జడ్.పి.సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా మహిళా,శిశు,వయో వృద్దులు, దివ్యా oగుల శాఖ అధికారిణి కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు