Bandi Sanjay: ప్రజా దీవెన, కరీంనగర్: ఉగ్రవాదా న్ని సమూలంగా నిర్మూ లించడమే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేం ద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోంద ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చింద న్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్దంలో అవసరమైతే సా మాన్య ప్రజలు కూడా పాల్గొనేందు కు సిద్దమయ్యారన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్ర వాద శిబిరాలను ద్వంసం చేయ డంతో పాటు ఉగ్రవాదులను మట్టు బెట్టిన ఘనత భారత సైన్యానిదేన న్నారు.
‘ఉగ్రవాద వ్యతిరేక దినం’ సంద ర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగం ఆయన మాటల్లో నే
ప్రపంచంలో టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నా యనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. పెహల్గాం ఘటన అ నంతరం భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి ధ్వంసం చే యడంతోపాటు ఉగ్రవాదులను మ ట్టుబెట్టిన మన సైన్యం ధైర్య సాహ సాలను చూశాం. పాకిస్తాన్ టెర్ర రిస్టులకు అడ్డాగా మారింది. టెర్రరి స్టులను ప్రోత్సహిస్తూ ఆదేశం ఆర్ధిక సాయం చేస్తోంది. నరేంద్రమోదీ ప్ర భుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. ముం బయి పేలుళ్లు, లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్లు, మక్కా మ సీదు పేలుళ్ల తరువాత దేశ ప్రజల్లో మార్పులు వచ్చాయి. అవసరమై తే దేశం పక్షాన టెర్రరిజంపై యుద్దం చేసేందుకు సిద్దంగా ఉండటం సం తోషకరం.
పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాం తాల్లో సామాన్య ప్రజలను, వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలనుకుంది. టెక్నాలజీని ఉ పయోగించుకుని వాటిని తిప్పికొ ట్టిన ఘనత మన సైన్యానిదే. మో దీ నాయకత్వంలో అమిత్ షా సా రధ్యంలో టెర్రరిజం ఏ రూపంలో అంతం చేసేందుకు చర్యలు తీసు కుంటోంది. సామాన్య ప్రజలు, స్వ చ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వా లు దేశ సైన్యానికి మద్దతుగా నిల వడం దేశ భక్తికి నిదర్శనం.చిన్నా పెద్దా ముసలి ముతక తేడా లేకుం డా టెర్రరిజం అంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మ ట్టుపెట్టాల్సిందే. ఇందులో మరో ఆ లోచనే లేదు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వ హించడం సంతోషంగా ఉందన్నా రు.