రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త
డీఏ పెంచుతూ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభ వార్త వినిపించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం తో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), పింఛనుదారులకు కరవు భృతి(డీఆర్) 2.73 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా ఈ కరవు భత్యం పెంపు 2022 జనవరి నుంచి వర్తిస్తుoడగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుందని అంచనా.
ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 974.16 కోట్ల అదనపు భారం పడనుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ. 1380.09 కోట్ల బకాయిలను చెల్లించనుoడగా పెరిగిన డీఏ జూన్ నెల వేతనం, పింఛనుతో కలిపి ఇవ్వనున్నట్లుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావువెల్లడించారు. డీఏ పెంపుపై టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.