Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడిల దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు

ఈ ప్రమాదంలో దాదాపు 60మందికి పైగా గల్లంతు
ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్​
కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఘోర దుర్ఘటన

 

ప్రజాదీవెన, కాంగో: భారీ వర్షాల కారణంగా కొండచరియలు(landslide) విరిగి పడిల దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నైరుతి కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఉన్న ఓడరేవు సమీపంలో శనివారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు. అయితే గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్​ను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

‘ప్రమాదంలో గల్లంతైన వారిని కనుగొనేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. సహాయక చర్యల్లో ఏడుగురిని ప్రాణాలతో రక్షించగలిగాం. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తరలించాం. ఇంకా 60మంది ఆచూకీ తెలియాల్సి ఉంది’ అని ప్రావిన్షియల్​ తాత్కాలిక గవర్నర్​ ఫెలిసియన్​ కివే తెలిపారు.

‘ఓడరేవు సమీపంలో ఒక పెద్దకొండ ఉంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో ప్రతి శనివారం మార్కెట్​ జరుగుతుంది. మత్స్యకారులు చేపలు, ఇతర నిత్యవసరాలు అమ్ముకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. అయితే మార్కెట్​కు అధిక సంఖ్యలో ప్రజలు రావడం వల్ల ఎంతమంది గల్లంతయ్యారో అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేము’ అని స్థానిక అధికారి ధేధే ముపాసా చెప్పారు.

ట్రక్కును ఢీకొన్న బస్సు- 18 మంది మృతి
ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగో రాజధాని కిన్షాసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎన్‌డిజిలి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు వెళ్తున్న సమయంలో మలుపు తిరగడానికి ప్రయత్నించిన బస్సు, ఓ ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సంబంధిత శాఖల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

15 people died in the landslide in Congo