Polling: ఒక్క ఓటు కోసం కారడవిలో 18 కిలోమీటర్ల నడక..!
కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు.
ప్రజాదీవెన, కేరళ: కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!
18 KM walk in forest for one vote