America :ప్రజా దీవెన, అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో అనేకరకాల ఆందోళన లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవై పు ఆర్థికమాంద్యంతో ఆందోళన ప రిస్థితులు ఉధృతమవుతున్న తరు ణంలో మరో మారు అమెరికాలో మళ్లీ తూటాపేలింది.
వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తు లు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలి పారు. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కా ర్యాలయ ప్రతినిధి మేజర్ ఎలిజ బెత్ స్కాట్ మాట్లాడుతూ వాషింగ్ట న్ డీసీకి నైరుతి దిశలో 105 కిలో మీటర్లు దూరంలో ఉన్న స్పాట్సిల్వే నియా కౌంటీలోని ఓ నివాస సము దాయంలో సాయంత్రం 5:30 గంట ల ప్రాంతంలో కాల్పుల ఘటన జరి గిందని ప్రకటించారు.
ఆ తర్వాత 911 ద్వారా సమాచా రం అందిందని వెంటనే అధికారు లు రంగంలోకి దిగి దర్యాప్తును ము మ్మరంగా ప్రారంభించారని చెప్పా రు.
అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారని పేర్కొన్నారు. కా ల్పులు జరిగిన చోట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చే యలేదని కాల్పులు జరిగిన ప్రాం తానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అంది స్తుండగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదన్నారు.