Anumula Govt ITI: ప్రజా దీవెన, అనుముల: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల ప్రభుత్వ ఐ. టి. ఐలో (Anumula Govt ITI) ఆరవ వాక్ ఇన్ అడ్మిషన్స్(Walk in Admissions) చేపట్టనున్నట్లు ప్రిన్సి పాల్ మల్లిఖార్జున్ (Mallikharjun) తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మ్యాన్యు ఫ్యాక్చ రింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటో మేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యు ఫ్యాక్చ రింగ్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చు వల్ వెరిఫైయర్ (మెకానికల్), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, అడ్వాన్స్ సిఎన్సి మెసి నింగ్ టెక్ని సియన్ మరియు మెకా నిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త అడ్వా న్స్డ్ ట్రేడ్ల యందు ఆరవ వాక్ ఇన్ అడ్మిషన్ సీట్ల భర్తీ కొరకు పదవ తరగతి ఉత్తీర్ణులై, పద్నాలుగు సంవత్సరాల వయస్సు పై బడిన వారు https://iti. telangana. gov.in అనే వెబ్ సైట్లో ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కొత్తగా ధరఖాస్తు చేసుకున్నవారు వివిధ పేజులలో దరఖాస్తు చేసి సీటు రాని వారు రిజిస్ట్రేషన్ ఫారం తోపాటు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్ల తో తేది:18-10- 2024 వరకు “ఆరవ వాక్ ఇన్ అడ్మిషన్” కౌన్సె ల్లింగ్ కు హాజరు కావాలని కోరా రు.అడ్మిషన్ ప్రక్రియ మొత్తము రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారము మెరిట్ ప్రకార ము నిర్వహించబడునని చెప్పా రు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.