–శాలిగౌరారంలో ధర్నా, ర్యాలీ నిర్వహించిన ఆశా వర్కర్లు
Asha workers:ప్రజా దీవెన, శాలిగౌరారం: ఆశా వర్కర్లను (Asha workers) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,PF, ESI తదితర సౌకర్యాల తో పాటు చట్ట బద్దత కలిపించాలని డిమాండ్ (demand) చేస్తూ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల ఆశా వర్కర్లు బుధవారం శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా, ర్యాలీ (rally)నిర్వహించారు.గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేసిన సందర్బంగా ప్రభుత్వ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.ప్రవేటీకరణ (Propagation) చేయకుండా ఎన్ హెచ్ ఎం స్కీం లో బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు.
ఆశాలకు నష్టం కలిగించే ‘పరీక్షను’ కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆలోచనను విరమించుకోవాలన్నారు.45 వ ఎల్ ఐ సి సిపారుసులను అమలు చేయాలని డిమాండు చేశారు. విద్యార్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నెలకు 10 వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కలిపించాలని డిమాండ్ (demand) చేశారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఆశా వర్కర్స్ పెడరేషన్ శాలిగౌరారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బల్లెం నవనీత, రేణుక, ఉపాధ్యక్షురాలు సైదమ్మ, కార్యవర్గ సభ్యురాల్లు బి. లక్ష్మి,మాదవమ్మ,సైదమ్మ,పార్వతమ్మ,జ్యోతి,మాధవి, కవిత వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం మండల ప్రాథమిక వైద్యాధికారిణి డాక్టర్ సూర్య శిల్ప కు తమ డిమాండ్ల వినతి పత్రాన్ని అందజేశారు.