Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ayushman Card: వృద్ధులకు ఆయుష్మాన్ కార్డు ఎంతో కీలకం.. ఇలా పొందండి..

Ayushman Card: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అనే ఆరోగ్య పథకాన్ని మరింత ఎక్స్‌టెండ్ చేసింది. 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ కార్డు (Ayushman Card) పొందవచ్చు. అంటే, ఎంత సంపాదన ఉన్నా, ఏ వర్గం వారైనా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు (Old people), దేశంలోని ఏ ఆస్పత్రిలో (Hospital) అయినా 5 లక్షల రూపాయల వరకు వివిధ రకాల చికిత్సలు (Treatments) ఉచితంగా పొందవచ్చు.

ఈ పథకం గురించి మరింత తెలుసుకోవడానికి, ఆయుష్మాన్ భారత్ కార్డు ఎలా పొందాలో కేంద్ర ప్రభుత్వం సులభమైన విధానం కూడా వివరించింది. ఆ విధానం ప్రకారం ఇకపై 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆయుష్మాన్ కార్డు కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంటి నుంచే మొబైల్ ఫోన్‌లో (Mobile phone) కొన్ని క్లిక్‌లతో ఈ కార్డును పొందవచ్చు.

ఎలా అంటే?

ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ని తయారు చేసింది. ఈ యాప్‌ (App)ని మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలానే ఆధార్ కార్డు (Aadhar Card) ఉంటే చాలు. ఆధార్ కార్డు నంబర్‌ని ఆ యాప్‌లో ఇవ్వాలి. కొంత పర్సనల్ డేటా ఇచ్చాక, మీ ఆయుష్మాన్ కార్డు రెడీ అవుతుంది. ఈ కార్డు ఉంటే, దేశంలోని ఏ ఆస్పత్రిలో అయినా చాలా రకాల తీవ్రమైన వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.

ఇది ఎలా పని చేస్తుంది?

ఈ కొత్త కార్డు కోసం మీరు మళ్లీ రిజిస్టర్ (Register) చేసుకోవాలి. ఈ కార్డు ఉంటే, దేశంలోని ఏ ఆస్పత్రిలో అయినా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స చేయించుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (central government) ఇచ్చే ఆరోగ్య పథకాలను ఉపయోగిస్తున్న 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రైవేట్ ఆరోగ్య బీమా ఉన్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు.