Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 9:14 am Posted by : praja deveena

Bahrain coast guard tragedy : బిగ్ బ్రేకింగ్, బహ్రెయిన్ తీరంలో విషాదం,అలల తాకిడికి నిజామాబాద్ వాసి బలి

Bahrain coast guard tragedy : ప్రజా దీవెన, మనామా: కండ్ల నిం డా కలలు,కుటుంబానికి అండగా నిలవాలనే తప న… ఆరేళ్ల క్రితం ఆ యనను అరబ్ దేశం వైపు అడుగులు వేయించాయి. కానీ, విధి ఆడి న వింత నాటకంలో ఆ వలస జీవి ప్ర యాణం సముద్ర గర్భంలోనే ముగిసిపోయింది. బహ్రె యిన్‌లో జరిగిన ఒక ఘోర సముద్ర ప్రమాదం నిజామా బా ద్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో తీరని చీకట్లను నింపిం ది.నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట ఉపాధి కో సం 2019లో బహ్రెయిన్ చేరుకు న్నారు. అక్కడ ప్రముఖ ‘మ హమ్మ ద్ అహ్మద్’ సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ అంద రి మన్ననలు పొందారు. అయితే, విధి ఆయన రూపంలో పొంచి చూసింది. ప్రసిద్ధ ప ర్యాటక ప్రాంతమైన దుర్రత్ అల్ బ హ్రెయిన్ సముద్ర తీరంలో శ్రీని వా స్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు.


   క్షణాల్లో రంగంలోకి కోస్ట్ గార్డ్

ప్రమాదం జరిగిన వెంటనే సమా చారం అందుకున్న బహ్రె యిన్ తీర రక్షక దళాలు (కోస్ట్ గార్డ్) అత్యంత వేగంగా స్పం దించాయి. సంఘట నా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆ పరే షన్ చేపట్టినప్పటికీ… అప్పటి కే జరగకూడని నష్టం జరిగి పోయింది. శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

శ్రీనివాస్ ఆకస్మిక మరణవార్త విన గానే నిజామాబాద్‌లోని ఆయన స్వగ్రామం దిగ్భ్రాంతికి గురైంది. క ష్టపడి పనిచేస్తూ కుటుంబానికి కొం డంత అండగా ఉంటాడనుకున్న వ్యక్తి.. ఇలా అనంత లోకాలకు వె ళ్లిపోవడంతో భార్యాపిల్లలు, బం ధువులు కన్నీరుమున్నీరవుతున్నా రు.శ్రీనివాస్ మృతి పట్ల ఆయన ప నిచేస్తున్న ‘మహమ్మద్ అహ్మద్’ సంస్థ యాజమా న్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక మంచి ఉ ద్యోగిని కోల్పోయామంటూ విచా రం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుం బానికి తమ సానుభూతిని తెలి యజేసింది. ప్రస్తుతం శ్రీని వాస్ భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు సంబం ధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.