–దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు చెంపపెట్టు
–ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కు ధన్యవాదాలు
–అట్టడుగునున్న వర్గాలకు ప్రభు త్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం
–1997లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం
–హైదరాబాద్ ఎన్నికల సభలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని ఉద్ఘాటన
–ఎన్నికల అనంతరం ఎస్సీ వర్గీకర ణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వ ర్యంలో కమిటీని నియమించాం
–ఆ కమిటీ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
–సుప్రీం తీర్పుతో నెరవేరబోతోన్న కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం
–మంద క్రిష్ణ మూడు దశాబ్దాలఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం
–కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీక రణకు (For SC category) అనుకూలంగా సుప్రీంకో ర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని కేంద్ర హోం శాఖ సహాయ మం త్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. భారతీయ జన తా పార్టీ పక్షాన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తు న్నామని, దళి తులను విభ జించి రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని కుట్ర లు చేసి న రాజకీయ పార్టీల కు ఈ తీర్పు చెంపపెట్ట ని అభివర్ణించారు.ఎస్సీ వర్గీ కరణ కోసం దశాబ్దల తరబడి ఎదురు చూస్తున్న కోట్లాది మంది దళితులకు, పోరాటం చేస్తున్న లక్షలాది మంది నాయ కుల కల సుప్రీంకోర్టు తీర్పు తో అతి త్వర లోనే నెరవేరబో తోం దని చెప్పారు. కోర్టు తీర్పుపై అపార్ధాలకు తావి వ్వకుండా దళితులంతాకలిసి మెలిసి ఉండాలని వేడుకుంటు న్నానని కోరారు. రాజ కీయ లబ్ది కోసం తీర్పును చిలువలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చేయొద్దని కోరుతున్నానని అప్పీల్ చేశారు.
ప్రధానమంత్రి నరేం ద్రమోదీ (Narendra Modi)కి, హోం మంత్రి అమిత్ షా కి (Amit Shah) ధన్యవాదాలు తెలిపారు. సుప్రీం కోర్టు తీ ర్పు పై బండి సంజయ్ స్పందన ఆయన మాటల్లోనే…ఎస్సీ వర్గీ కరణకు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కట్టుబడి ఉంది. అట్టడుగు నున్న, అణగారిన వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాల న్నదే బీజేపీ అత్యోందయ సిద్ధాంతం. బంగారు లక్ష్మ ణ్ ఆధ్వర్యంలో 1997లో నే ఎస్సీ వర్గీకరణ జరపాలని తీర్మానించిం ది. అనేక వేదికల్లో ఎస్సీ వర్గీకరణ జరపా ల్సిందేనని బీజేపీ స్పష్టం చేసింది.అసెంబ్లీలో ఎస్సీ వర్గీకర ణకు అను కూలంగా రూ పొందిం చిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పొరుగునున్న కర్నా టక లో కూడా గత బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రిజర్వే షన్లను అమలు చేసింది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమ యంలో ప్రధా నమంత్రి నరేంద్రమో దీ (Narendra Modi)హైదరాబాద్ విచ్చేసిన సందర్భం గా పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ లోనూ ఎస్సీ వర్గీకర ణకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటిం చారు.ఎన్నికల అనంతరం ఇచ్చిన మాట మేరకు నరేంద్రమోదీ కేంద్ర కేబి నెట్ సెక్రట రీ ఆధ్వ ర్యంలో కమిటీని నియమిం చారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధా రంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకర ణకు అనుకూలంగా సుప్రీంకో ర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభు త్వ ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకుని వర్గీక రణకు అనుకూ లంగా తీర్పు ఇవ్వ డం హర్షణీయం. ఇది ఒక సామా జిక సమస్య, దీనిపై రాజకీయ పార్టీ లు చిలువలు పలు వలు చేసి వక్ర భాష్యం చెబుతూ దళిత సోదరుల మధ్య వైష మ్యా లు స్రుష్టించి సమాజాన్ని చీల్చొద్దని కోరుతున్నా. ఈ అంశాన్ని రాజకీ య కోణంతో చూడొద్దు వర్గీక రణ తీర్పుతో ఎవరికైనా అన్యాయం జరుగు తుందని భావిస్తే వారిపట్ల కేంద్రం సానుకూలంగా స్పందించి న్యాయం చేసేందుకు సిద్దంగా ఉంది. సుప్రీంకోర్టు (supreme court) తీర్పును విశాల హ్రుదయంతో అర్ధం చేసుకోవాలని, అపార్థాలకు తావివ్వకుండా దళిత సోదరులంతా కలిసి మెలిసి ఉండా లని వేడుకుంటున్నానని అభ్య ర్థించారు.