Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bathukamma celebrations: అమెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

–బతుకమ్మ పండగను అధికారి కంగా తాజాగా గుర్తించిన నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు
–ఫలించిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ప్రవాస తెలంగా ణీయుల కృషి

Bathukamma celebrations: ప్రజా దీవెన, హైదరాబాద్: నేలకు పూల రంగులనద్ది, ప్రకృతి ని పూజించే తెలంగాణ సాంస్కృ తిక వైభవం బతుకమ్మ (Bathukamma celebrations) ఖ్యాతి ఖం డాంతరాలను దాటింది, ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడు చులు అంగరంగ వైభవంగా బతుక మ్మను ఆడుతున్నారనే విషయం తెలిసిందే, ప్రతిష్టాత్మక వైట్ హౌజ్, ఆస్ట్రేలియా ఒపేరా హౌజ్, లండన్ బ్రిడ్జ్, ఐపిల్ టవర్ (White House, Australian Opera House, London Bridge, Eiffel Tower)ఇలా పలు చోట్ల వేడుకగా జరిగే బతుకమ్మ పండగ ను అమెరికా రాష్టాలైన నార్త్ కరో లినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియాలు తాజాగా అధికారికం గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసా యి, ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈవారాన్ని బతుకమ్మ పండగ, తెలంగాణ హెరిటేజ్ వీక్ గా ప్రకటిం చారు. బతుకమ్మ వైభవాన్ని, ప్రజ లను కలుపుతూ వారి మద్య పెం పొదిస్తున్న సుహృద్బావ వాతా వరణాన్ని కొనియాడారు.

గత కొంత కాలంగా తెలంగాణ బతు కమ్మకు (Bathukamma celebrations) ఖండాంతరాల్లో వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, పలు ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణీయులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపుతో ఫలితం దక్కినట్ట యింది. గతంలో సైతం కొన్ని అమె రికా సంయుక్త రాష్ట్రాలు బతుక మ్మను గుర్తించిన విషయం విదిత మే ఈ సందర్భంగా గ్లోబల్ తెలం గాణ అసోసియేషన్ (Global Telam Singing Association)ప్రతినిధులు తెలంగాణ ఆడపడుచులకు అభి నందనలు, అమెరికాలోని ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.