Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 3:53 am Posted by : praja deveena

Southern Spain Train Accident : బిగ్ బ్రేకింగ్, దక్షిణ స్పెయిన్‌లో ఘో ర రైలు ప్రమాదం, హై-స్పీడ్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో కనీసం 21 మంది దుర్మరణం 

Southern Spain Train Accident : ప్రజా దీవెన, స్పెయిన్: దక్షిణ స్పె యిన్‌లో ఆదివారం హై-స్పీడ్ ప్యా సింజర్ రైలు పట్టాలు తప్పడం అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాక్‌ పైకి వెళ్లి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, పదుల సంఖ్యలో చాలా మంది గాయపడ్డా రని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వేగంతో నడిచే హై-స్పీడ్ రైలు ప ట్టాలు తప్పడం, పట్టాలు తప్పడం అదే సమయంలో ఎదురుగా వస్తు న్న రైలు మార్గంలోకి ప్రవేశించడం తో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం రెండు రైళ్లకు తీవ్ర నష్టం క లిగించగా తదనుగుణంగా అనేకా నేక రైలు కోచ్‌లు చిక్కుకపోవడంతో పాటు ప్రయాణికులు కూడా అందు లోనే చిక్కుకున్నారు.

ప్రమాదం అనంతరం అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరు కుని, పెద్ద ఎత్తున సహాయ చర్యను ప్రారంభించాయి. అగ్నిమాపక సి బ్బంది, వైద్య బృందాలు, పోలీసు లు గంటల తరబడి శ్రమించి ప్రాణా లతో బయటపడిన వారిని తరలిం చడానికి, ప్రథమ చికిత్స అందించ డానికి మరియు గాయపడిన వారి ని సమీపంలోని ఆసుపత్రులకు తర లించారు. గాయపడిన వారిలో చా లా మంది పరిస్థితి విషమంగా ఉం దని స్థానిక మీడియా సమాచారం అందిస్తోంది.

రైలు వేగం, ట్రాక్ పరిస్థితులతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థల సమీక్ష తో సహాపట్టాలు తప్పడానికి గల కారణాన్ని గుర్తించడానికి స్పానిష్ అధికారులు తక్షణ దర్యాప్తును ఆ దేశించారు. భద్రతా తనిఖీలు నిర్వ హించినందున ప్రభావిత ప్రాంతం లో రైలు సేవలను నిలిపివేశారు.

మృతుల కుటుంబాలకు రవాణా మంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మరియు భవిష్యత్తులో ఇ లాంటి విషాదాలు పునరావృతం కా కుండా జవాబుదారీతనం నెలకొల్ప డానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.