
Big Breaking: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సామాజిక ఉద్రిక్తతలు సృష్టించి, ప్ర జల మధ్య విద్వేష అగ్గిరాజేయడ మే లక్ష్యం వందలాది గంటల సీసీ టీవీ ఫుటేజ్, టెక్నాలజీ సాయంతో నల్లగొండ పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. జూన్ 6వ తేదీ తెల్ల వారుజామున 3:45 గంటల సమ యo నల్లగొండ పట్టణం హైదరాబా ద్ రోడ్డులోని ఎన్‌జీ కాలేజీ వద్ద అంతా ప్రశాంతంగా ఉన్న సమ యంలో ఒక వికృత చేష్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహనీయు డు, మాజీ ముఖ్యమంత్రి, నటర త్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహంపై పాత బెడ్‌షీ ట్లు కప్పి, పెట్రోల్ పోసి కొందరు దుండగులు నిప్పంటించారని నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ వెల్లడించారు. మున్సిపల్ అధి కారి బుజనూరి స్వప్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీ సులు (Crime No. 232/2026) కొత్త చట్టాల ప్రకారం (BNS & PD PP Act) కఠిన సెక్షన్ల కింద కేసు న మోదు చేశారు.

ఖైదీలను పట్టించిన కంటిచూపు పోలీస్ యాక్షన్ ప్లాన్
కేసు తీవ్రతను గమనించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ప ర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ రంగం లోకి దిగాయి. వందలాది గంటల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన చేయ డం ద్వారా సంఘటనా స్థలం నుం డి హైవేల వరకు ఉన్న ప్రతి కెమె రాను జల్లెడ పట్టారు. అనుమానా స్పద వాహనాల కదలికలు, మొబై ల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల స్కెచ్‌ను డీకోడ్ చేశారు. నిందితు లు వాడిన బలెనో కారు (TS-07 -HT-2430) ను ట్రాక్ చేసి నింది తులను పక్కాగా స్పాట్ చేశారు.

కటకటాల్లోకి ‘విద్వేష’ నిందితులు
ఈ పెను కుట్రకు పాల్పడిన ఇద్దరు చదువుకున్న నిందితులను పోలీ సులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ పాలకురి అశోక్ కుమార్ గౌడ్ (45), రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కు చెందిన ప్రైవేట్ ఉ ద్యోగి ఎలుకంటి ప్రణీత్ (23) లను అరెస్ట్ చేసి నేరానికి వాడిన బలెనో కారు, 2 హై-ఎండ్ మొబైల్ ఫోన్ల ను స్వాధీన పరుచుకున్నారు.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు
నిందితుల టార్గెట్ కేవలం నల్లగొం డ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్ర హాలను ధ్వంసం చేసి, ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, ఉద్రిక్తతలు రగి ల్చ డమే వీరి అసలు ప్లాన్ అని పోలీ సుల విచారణలో తేలింది. అందు లో భాగంగానే మొదటి ప్రయత్నం గా నల్లగొండలో ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ సమాజం లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, సోషల్ మీ డియా పోస్టులైనా, ఇటువంటి భౌ తిక దాడులైనా సమాజ సామర స్యాన్ని దెబ్బతీసే కుట్రలపై మా ని ఘా నిరంతరం ఉంటుందని హెచ్చ రించారు. నిందితుల డిజిటల్ డే టాను విశ్లేషిస్తున్నామని, దీని వెను క ఇంకా ఎవరైనా ఉన్నారేమో తే లుస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చి ఈ సున్నితమైన కేసును ఛేదిం చిన డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌ న్ సీఐ రాఘవరావు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎస్‌ఐ సైదాబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి తో కూడిన బృందాన్ని ఎస్పీ ప్రత్యే కంగా అభినందించి, రివార్డులను ప్రకటించారు.



