BIGVIRAL : ప్రజా దీవెన, అమరావతి: ఎవరేమి చేసినా, ఎవరేమన్నా ఏమిచేయ కుండా నిమ్మకున్నదే మంచిదన్నది నానుడి. సరిగ్గా అదే తరహాలో ఏం చేయకపోవడమూ మంచిదే అన్నట్లుగా వైరలైన 5 స్టార్ చాక్లెట్ యాడ్ గుర్తుందిగా. సేమ్ టూ సేమ్ అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగం గా ఆంధ్రప్రదేశ్ లో అంగరంగ వైభ వంగా జరిగే కోడిపందాల్లో ఓ పం దెం కోడి పోరాడకుండానే గెలిచేసి చరిత్ర సృష్టించింది. కోడిపందాల్లో భాగంగా ఒకే దఫా 5 కోళ్లు బరిలో దిగగా 4 కోళ్లు ఒకదానిపై ఒకటి పోటీకి దిగి దాడి చేసుకుని ఒక్కొ క్కటిగా నేలకొరిగాయి.
మొదటి నుంచి ఒకే చోట నిమ్మకుండా నిలు చున్న కోడి పోటీ లేకుండానే చిట్ట చివరి విజేతగా నిలిచి ఈ దఫా కోడిపందాల్లో ఆకట్టుకున్న అంశం గా నిలిచింది. మొత్తానికి ఈ వీడియో మాత్రం మస్తుగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ కోడి తెలివైనదని కొందరు అంటుం డగా, ఎప్పటికైనా అది కూరలా మారాల్సిందేనని మరికొందరు వ్యా ఖ్యానిస్తున్నారు.
Kodipandallu full vairal pic.twitter.com/fOLZaKY3NM
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 15, 2025