Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS kcr : రైతు డిక్లరేషన్ రేవంత్ ప్రభుత్వ నిరంకుశత్వం

--బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్

రైతు డిక్లరేషన్ రేవంత్ ప్రభుత్వం నిరంకుశత్వం

–బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్

BRS kcr : ప్రజా దీవెన, నల్లగొండ: రైతు డిక్ల రేషన్ దారుణమైన విషయమని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనమని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తీవ్ర స్థా యిలో విరుచుకుప డ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 400 రోజులు పూర్తి అవుతున్నా నెరవేర్చిన పాపాన పోలేదని దు య్యబట్టారు. రైతుభరోసా కూడా డిసెంబ ర్ 3 తర్వాత రూ. 7500 అని చెప్పి నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. శనివారం నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నిక ల ముందే అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ యాసంగి రైతు బం ధు ఇద్దామని ప్లాన్ చేస్తే రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, కానీ అవే నిధు లను యాసంగిలో రూ. 5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నార న్నా రని విమర్శించారు. కానీ వాన కాలం భరోసా లేదని, యాసంగి భరో సాలో అనేక నిబంధనలు పెడుతున్నారన్నారు. ఆనాడు కెసిఆర్ ఏ నిబంధన లేకుండా రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేడు రైతులు ప్రమాణ పత్రా లు ఇవ్వాలంట, రైతులు ఏమన్న దొంగలు మాదిరి కనబడుతున్నారా అని ప్రశ్నించారు. మొత్తానికి రైతు బంధు కే ఎగనామం పెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రూ. 22 వేల కోట్లు దుర్వినియోగం అంటున్నారు కదా, ఆ రైతులు ఎవరో వారి జాబితాతో గ్రామ పం చాయతీల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.రైతుల అండగా ఉండేం దుకు వ్యవసాయాన్ని ఇష్టంగా మా ర్చేoదుకు కెసిఆర్ రైతుబంధు ను పెట్టారని, పత్తి, మిర్చి, కంది లాం టి మెట్ట పంటలు వేసే ప్రాంతా ల్లో రెండో పంట వేయడానికి ఆస్కా రం ఉండదన్నారు. ఇపుడు వీళ్లకు కట్ చేయడానికి కుట్రలు చేస్తు న్నా రన్నారు. రైతుల సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉన్న దని, ప్రజా పాలన దరఖాస్తుల్లో సైతం రైతుబంధు సమాచారం ఇచ్చా రని, ఇవ్వన్నీ ఉన్నాక మళ్ళీ ఎందుకు ప్రమాణ పత్రాలని ప్రశ్నించారు.

వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు 22 లక్షల మంది కౌలు రైతు లకు భరోసా ఇస్తామన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో స్పష్టం చేయాల న్నారు. వ్యవసాయ కూలీలకూ ఇస్తామన్న డబ్బులు ఎపుడు ఇస్తా రని అడిగారు. రైతులను మోసం చేసేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తు న్నారని ధ్వజమె త్తారు. రైతు భరోసా ఎంతమందికి ఇవ్వాలనుకుం టున్నారు, రుణ మాఫీ ఎంత మందికి ఇచ్చారో, బోనస్ ఎంత మంది కి ఇచ్చారో గ్రామాల్లో జాబితాలు పెట్టాలని డిమాండ్ చేశారు.ఒక్కో రైతుకు ప్రభుత్వం 17,500 బాకీ ఉన్నదని, వీటన్నింటిని సా ధించేందుకు ప్రభుత్వంపై పోరాటానికి బిఆరెస్ పార్టీ సిద్ధంగా ఉంద న్నారు.

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పా లన రెండో ఏడాదిలో అడుగు పెట్టింది కానీ ఏ ఒక్క హామీని అమలు చే యకపోగా ఒక్కో పథకానికి పంగా నామాలు పెట్టే పనిలో మాత్రం ఉరుకులు పరుగులతో ముందు న్నారన్నారు.చీకట్లో మగ్గు తున్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు కెసిఆర్ కంకనం కట్టు కుని పనిచేసారని, 24 గంటల కరెంట్, పెట్టుబడి సాయంలాంటివి తీసు కొచ్చారని, వ్యవసాయం బంధు కావొద్దని, బాగు కావాలని కెసిఆర్ భావించారు. వ్యవసాయం చేసేం దుకు కావాల్సిన అన్ని సౌక ర్యాలు కల్పించి రైతులను ప్రోత్సహించారని గుర్తు చేశారు.

ఇవ్వన్నీ జరుగుతుంటే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించు కున్నారని విమర్శిం చారు. రైతుభరోసా రూ. 7500 ఇస్తామని చెప్పా రు కానీ నేటికీ అమలు చేయలేదన్నారు. కెసిఆర్ ఇచ్చిన పెట్టుబడి సాయన్ని సైతం ఎగగొట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నా రు. రైతుల డిక్లరేషన్ ఇవ్వడం కాదు రేవంత్ రెడ్డి నే తాము తప్పకుం డ రైతుభరోసా ఇస్తా మని ప్రజలకు డిక్లరేషన్ ఇవ్వాలన్నారు.ఇంకా రుణమాఫీ 70 శాతం మందికి కాలేదని, ఇపుడు రైతు భరోసా కూడా 30 శాతం ఇచ్చి 70 శాతం మందికి ఎగనామం పెట్టాలని చుస్తున్నారని ఆరోపించారు.

మహిళలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నేతల ను ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని పిలుపు ని చ్చారు. పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్న మంత్రి కోమటిరెడ్డి ఎక్కడ పండుకున్నాడనీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలినీ, మీ మా టకూ కట్టుబడి ఉండలేక పోతే వెం టనే ఎమ్మెల్యే, మంత్రి పదవికి కోమటి రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంతో రాష్ట్రా న్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగనా నిలిపిన కెసిఆర్, కేటీఆర్, హరీస్ రావు, జగదీశ్ రెడ్డి లాంటి నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లా డితే సహించేది లేదన్నారు.

జడ్పీ మాజీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ షరతులు లే కుండా రైతు భరోసా ఇవ్వాలన్నారు. దరఖాస్తులు అంటే మళ్ళీ రైతు లు కాంగ్రెస్ నేతలను, వీఆర్వో లను సంప్రదించలా మళ్ళీ దళారీ వ్యవస్థకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ తో మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో పూర్తి పూర్తి వైఫల్యo చెందిందని ఆరో పించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని కెసిఆర్ గొప్ప ఆశయంతో రైతుబంధు తీసుకొచ్చారని, సక్రమంగా అమ లవు తున్న సందర్బంగా రేవంత్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చారని, ఎక రానికి రూ. 7500 చొప్పున, అవసరం అయితే మూడు పంట లకు ఇవ్వాలని నాడు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇపు డు రైతు భరోసా కూ ఎగనామం పెట్టాడానికి కుట్రలు చేస్తున్నా రన్నా రు. మూడు పంటలకు ఏమో కానీ కాంగ్రెస్ హయాంలో ఒక్క పంటకు దిక్కు లేదన్నారు. కెసిఆర్ కరోనా లాంటి కష్టకాలంలో సైతం రైతుబం ధు ఆపకుండా ఇచ్చారన్నారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఏడాదిలో ఏఒక్క హామీలు అమలు చేయలే దన్నారు. అసత్య ఆరోపణలు, రెచ్చ గొట్టే ధోరణితో కాలయాపన చేస్తున్నారన్నారు. దేశంలోనే దిక్కు మాలిన సీఎం రేవంత్ రెడ్డి అనే స్థాయిలో నిలిచారన్నారు. అయన దేవుళ్లపై ప్రమాణాలు చేసి దేవు ళ్ళకే ఎగనామం పెట్టాడని, ఇపుడు రైతుల ప్రమాణ పత్రాలు ఇవ్వాల నడం ఎవరీ కోసమని ప్రశ్నించారు.ప్రజల్లో వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు తప్పడు కేసులు, తిట్ల దండకం చేస్తున్నారన్నారు.

ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్ర హించే స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారన్నారు. గ్రామ స్థాయి నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు దోచుకుతింటు న్నారని అర్పించారు. అన్ని విభా గాల్లో కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రస్థానం లో నిలిస్తే రేవం త్ రెడ్డి సర్కార్ ఇపుడు రాష్ట్రాన్నీ ఆదమస్థానానికి దిగజారుస్తుoదన్నారు.

మునుగోడు మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై అధికారం లోకి వచ్చిందని చెప్పారు. అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను మోసం చే స్తు న్నారన్నారు. రాష్టంలో ఆంధ్ర పెత్తనంలోని కాంగ్రెస్ నేతలు పాలి స్తునారని, 13 మం ది సలహాదారుల్లో 8 మంది ఆంధ్ర ప్రాంతo వా ళ్ళు ఉన్నారని, నిమ్మ గడ్డ రమేష్, అనిలా రఘునాథరెడ్డి, శ్రీరామ సూర్య దేవర ప్రసన్న కుమార్, ఆదిత్య దాస్ శ్రీఆంజనే య రెడ్డి, శ్రీని వాసరావు లాంటి ఆంధ్ర వారి సలహాలతో ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు.సందర్బం వచ్చినప్పుడు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పా లని, అపుడే ప్రభుత్వం కండ్లు తెరిచి దిగివ స్తుందన్నారు.

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడు తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఈ ఓ లు ఉన్నారని, వీళ్ళద్వారా సమాచారం సులు వుగా తెలుసుకోవచ్చు కదా అన్నారు.రైతు రుణమాఫీ నాలుగవ విడ త డబ్బులు పడలేదని, ఇప్పటి వరకు ఇంకా మాఫీ కానీ వాళ్ళు ఉన్నారన్నారు. రైతులు అందరికి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాయకత్వాన్ని కించ పరిచేలా మాట్లాడడం తగద న్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చీరా పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్, కెవి రామారా వు,మాజీ ఆర్.ఓ మాలేశరణ్య రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైది రెడ్డి, మున్సి పల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ , పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని గణేష్, మున్సి పల్ కోఆప్షన్ సభ్యులు.. కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, లోడంగి గోవర్ధన్ మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి,దండంపెల్లి సత్తయ్య, మెరుగు గోపి, మైనార్టీ విభాగం ఇంచార్జ్ అన్వర్ పాషా, జి జంగయ్య కంకణాల వెంకటరెడ్డి, దొడ్డి రమేష్, విద్యార్థి భాగం నాయ కుడు బొమ్మరబోయిన నాగార్జున, షరీఫ్, కలీం అవినాష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు