BSNL : బిఎస్‌ఎన్‌ఎల్ (BSNL) (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పూర్వ వైభవం సాధించడానికి కొత్త హంగులతో రెడీ అయ్యింది. గత కొన్నాళ్లుగా మిగతా ప్రయివేట్ టెలికాం ఆపరేటర్ల పోటీకి కుదేలు అయిన బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటోంది. ఇపుడు చాలామంది స్వయంగా బిఎస్‌ఎన్‌ఎల్ బాట పడుతున్నారు. అందుకే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కస్టమర్లకు కొత్తగా రెడీ అయ్యింది. ఈ క్రమంలో కొత్త లోగో ఒకటి విడుదల చేయడం ద్వారా కొత్త సేవలను ప్రారంభించింది. తాజాగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సేవలను ప్రారంభించడం జరిగింది.
తాజాగా క్షణాల్లో సమాచారం అందుకునేందుకు వీలుగా 5జీ కనెక్టివిటీని కూడా రూపొంచించింది బిఎస్‌ఎన్‌ఎల్. అందులో భాగంగా స్పామ్ బ్లాకర్, సిమ్ కియోస్క్ లు, (Spam blocker, SIM kiosks,) దేశంలోనే ప్రప్రథమంగా డైరెక్ట్ టు డివైస్ సర్వీసుని కలిగిఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా సీడాక్ భాగస్వామ్యంతో పూర్తిగా దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించి, మైనింగ్ కార్యక్రమాల్లో ఉన్న వారు సైతం ఈ సర్వీసులని వాడే విధంగా పూర్తిస్థాయి 5g, 4జీ సర్వీసులను రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్ వాటా విషయంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల కన్నా బిఎస్‌ఎన్‌ఎల్ చాలా వెనుకబడి ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబై నగరాల్లో వంటి నగరాల్లో ‘‘నెట్‌వర్క్ యాజ్ ఏ సర్వీస్’’ పేరిట కొత్త ఫైనాన్సింగ్ మోడల్‌ను ప్రారంభించనుంది.
ఇక బిఎస్‌ఎన్‌ఎల్ (BSNL) దేశంలోనే తొలి డైరెక్ట్ టు డివైస్ కనెక్టివిటీ సొల్యూషన్ ఉపగ్రహ, కేబుల్ మొబైల్ నెట్‌వర్క్‌లు రెండింటినీ అనుసంధానం చేస్తున్నట్టుగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) చెప్పుకొచ్చారు. దీని వల్ల వారికి ఎలాంటి అదనపు చార్జి లేకుండానే బిఎస్‌ఎన్‌ఎల్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు లభించనున్నాయి. అదేవిధంగా సమీప భవిష్యత్తులో అయితే టెలికాం సర్వీసుల టారీఫ్ చార్జులు పెంచే ఆలోచన కూడా లేదని బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాబర్ట్ రవి పేర్కొన్నారు. కాబట్టి బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ కి మారాలనుకున్నవారు నిశ్చింతగా మారవచ్చని సూచించారు.