Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Budget Cars: తక్కువ ధరలో మంచి కార్ల ఇవే….!

Budget Cars: ప్రస్తుత రోజులలో కార్లకు (cars) భారీగా డిమాండ్ (demand)పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తరువాత చాలా మంది కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచల ఎక్కువగా ఉన్నారు . దీనిని ఆధారంగా కార్ల కంపెనీలు వారు కూడా కస్టమర్లను అక్కటుకునే విదంగా తక్కువ బడ్జెట్‌లో కార్లను మార్కెట్లోకి రీలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్ బడ్జెట్‌ కార్ల (Budget Cars) ఏమిటంటే..

అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లలో (best cars) హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.84 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉండడంతో అందరిని అక్కటుకుంటుంది . ఇక ఈ కార్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించారు. ఇక ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను (Naturally aspirated engine) వాడారు. అలాగే సీఎన్‌జీ (cng) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఇక అలాగే టాటా పంచ్‌ (tata punch)కూడా తక్కువ బడ్జెట్‌లో కస్టమర్ లకు అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ వేరియంట్‌ ధర రూ. 5.99 లక్షలుగా ఉండగా. ఇక ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉపయోగించారు.ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తీసుకొచ్చారు సీఎన్‌జీ (cng)ఆప్షన్ కూడా ఇచ్చారు.

ఈ లిస్ట్ లోకి మరోక కార్ ఏమిటంటే.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Extr) బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కారు ఎక్స్‌ షోరూం ప్రైజ్‌ రూ. 6.12 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడల్స్‌లో కస్టమర్ లకు అందుబాటులో ఉంది. ఈ కార్ లో కూడా సీఎన్‌జీ (cng) ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

భారీ భద్రతతో పాటు మంచి ఫీచర్లతో కూడిన మరో కారు టాటా టియాగో (Tata Tiago). ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను వాడారు. దీన్ని 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కారు ప్రారంభవేరియంట్‌ ధర రూ. 5.59 లక్షలుగా నిర్ణయించారు కంపెనీ వారు. ఇది ఇలా ఉండగా అతి తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ కారు ఏమిటంటే… మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఈ కారు 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్సలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 5.55 లక్షలుగా ఉండగా. ఇందులో కూడా సీఎన్‌జీ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు తగ్గువ బడ్జెట్ లో కార్ (budget cars) కొనాలి అనుకుంటే ఈ కార్లు బెటర్ అనే చెప్పాలి..!