CBI cyber crimes: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో డిజిటల్ యుగంలో నేరాలు కూడా సాంకేతికం గా మారిపోతున్న తరుణంలో ప్రభుత్వ వ ర్గాలు సైతం వాటి ని అడ్డుకునే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా తమ కార్యకలాపాలు ముందుకు తీసు కె ళ్తు న్నారో ఇంకా వేగంగా వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ రంగ సం స్థలు అంతేవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రా ల్లో సీబీఐ ఒకేసారి మెరు పు దాడులు డిజిట ల్ అరెస్ట్” పే రుతో ప్రజలను బెదిరిం చి కోట్ల రూపాయలు దోచుకుంటు న్న సైబర్ మోసగాళ్లపై సీబీఐ భారీ ఆపరేషన్ ప్రారంభించిం ది. నిజానికి చట్టంలో లేని ఒక కల్పిత భావన. కానీ నేరగా ళ్లు దీనిని ఆయుధంగా మార్చుకున్నారు. అధికారుల పేరు తో ఫేక్ కాల్స్ చేసి, “మీపై కేసు ఉంది , మీరు డిజిటల్ అరె స్టులో ఉన్నారు” అంటూ బాధితులను భ యపెట్టి, వారి డ బ్బును ట్రాన్స్‌ఫర్ చేయించేవారని అందరికీ తెలిసిందే.
అయితే ఒక సీనియర్ సిటిజన్ నుంచి రూ.1.6 కోట్లకు పైగా ఇలా వసూలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. డ బ్బును ట్రాక్ చేయకుండా ఉండేందుకు, మోసపూరిత కం పె నీ పేర్లతో బ్యాంక్ ఖా తా లు తెరిచి, లేయర్‌లుగా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు అరెస్టయ్యారు. అందు లో ఒకరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాలు తెరవడంలో సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మిగతా ఇద్దరు నకి లీ ఖాతాల నెట్‌వర్క్ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు.
కాగా సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, ఫో న్లు, కీలక పత్రాలు స్వా ధీనం చేసు కొని వీటి ద్వారా ఈ మాఫియా నె ట్‌వర్క్ ఇంకా ఎంత పెద్దదో బయ టపడే అవకాశం ఉందని అధికారిక వ ర్గాలు అంచనా చేస్తున్నాయి. ఇదే సమయంలో సీబీఐ ప్రా ధాన్య త కలిగిన సూచన కూడా చేస్తోంది.డిజిటల్ అరెస్ట్ అనే చట్టపరమైన ప్రక్రియ లేదని, అధికారుల పేరుతో వచ్చే కాల్స్‌పై నమ్మకం పెట్టుకో కం డని భయపడి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయవద్దని హితవు పలుకుతోంది.
వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్ట ల్ లేదా సమీప పోలీసు లకు సమాచారం ఇవ్వాలని, డిజిటల్ ప్రపంచం ఎంత వేగం గా ఎదుగుతుందో, నేరగాళ్లు కూడా అంతే వేగంగా మా రు తున్నారు. కానీ అప్రమత్తతే మీ అసలైన రక్షణ అంటూ సీ బీఐ అధి కారులు ప్రజలకు సలహాఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు తమంతట తాము అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.