–సేధ్యానికే పెద్ద పీట వేస్తూనే కౌలు రైతులకు అవకాశం
–2024- 25 వార్షిక రుణ ప్రణాళిక విడుదల
–ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.5.40 లక్షల కోట్లు
–ఇందులో ప్రాధాన్య రంగాలకు రూ.3.75 లక్షలు
–రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu: ప్రజా దీవెన అమరావతి: చిన్నతరహా పరిశ్రమలకు రూ.వేల కరుణ సాయంలో రైతులకే అత్య ధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బ్యాంకర్లను కోరారు. సిఎం చంద్రబాబు నాయు డు (Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం 227వ ఎస్ ఎల్ బీ సీ (SLBC) సమావేశం జరిగింది. ఈ సందర్భం గా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల (State level bankers) సమావేశం విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి కె.అచ్చెంనాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర ఎస్ ఎల్ బీ సీ కన్వీనర్ సీఎన్వీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు విడుదల చేసిన రుణ ప్రణాళిక వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానంగా రైతులు, కౌలు రైతులకు (Farmers and tenant farmers) రుణ సాయం, ఉత్పత్తి పెరుగుదల, పేదరికం నిర్మూలన, ఉపాది అవకాశాల కల్పన, సంపదసృష్టి అంశాలపై బ్యాంకర్లతో సీఎం, మంత్రులు చర్చించారు.ఈ ఏడది లక్ష్యం రూ.5.40 లక్షల కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక (Loan plan) విడుదలను విడుదల చేశారు. ఇందులో రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం కాగ, గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. . డెయిరీ , ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3,23,000 కోట్లు పెట్టుకోగా…ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,75,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల (loan) లక్ష్యం నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి గత ఏడాది రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యం కాగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే ఎంఎస్ ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు ఇవ్వాలని, సాంప్రదాయేత ఇంథన సెక్టార్ కు రూ. 8000 కోట్లు రుణ ప్రణాళికను సిద్దం చేశారు.
ఆ అయిదు అంశాలపైనే చర్చ
మరీ ముఖ్యం అయిదు ప్రధాన అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ (Sub-committee with bankers) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వ్యవసాయంలో సాగు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ఱయం తీసుకుంది. ఇక రెండవ అంశం పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, మూడవ అంశంలో .డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంపై చర్చించారు. నాలుగో అంశంగా స్కిల్ డవల్మెంట్ కు చర్యలు తీసుకోవడం, అయిదవ అంశంగా .సంపద సృష్టించే, జిఎస్ డిపి (gsdp) పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.