బిగ్ బ్రేకింగ్, ఇద్దరు రౌడీషీటర్లకు నగర బహిష్కరణ
Citydeportation: ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో భయభ్రాంతులకు గురి చే స్తూ నేరాలకు పాల్పడుతున్న ఇరు వురు రౌడీషీటర్లకు నగర బహిష్క రణ చేస్తున్నట్లు సైబరాబాద్ పో లీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్ల డించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ఆయన ప్రక టించారు. శనివారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ నల్లగొండకు చెందిన రాజేష్ (33) @ మెంటల్ రాజేష్ మొత్తంగా 19 కేసులతో పా టు ముఖ్యంగా 4 మర్డర్ కేసులు ఉన్నాయని వివరిస్తూ సెక్షన్ 261 సి టీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తున్నామని తెలిపారు.
అదేవి ధంగా మరొకరు సురేందర్ @ సూ రి @ మోహీన్ 21 కేసులతో పాటు మర్డర్ కేసులలో మీర్ పేట సంబం ధించిన వ్యక్తిని కూడా సెక్షన్ 26(1) సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తు న్నామని తెలిపారు.ఇదిలా ఉండగా శనివారం జారీ చేసిన ఉత్త ర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాచకొండ సిపి సుదీర్ బాబు పేర్కొన్నారు.పోలీస్ చట్టం ప్రకారం బహిష్క ర ణకు గురైన వీరిద్దరూ మరల నగ రానికి వచ్చిన, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజ లకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. నగరంలో నేరస్తులకు ఎట్టి ప రిస్థితుల్లో స్థానం లేదని సిపి స్పష్టం చేశారు.
Cyberabad CP sudheerbabu announcement citydeportion pic.twitter.com/CszuWjlILG
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 6, 2025