CM A. Revanth Reddyv : ప్రజా దీవెన, హైదరాబాద్: బయో టెక్నాలజీ రంగంలో అగ్రశ్రేణి సంస్థ ఆమ్‌జెన్ ఇండియా ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత ఆగస్టులో అమెరికా పర్యటించిన సందర్భంగా ఆమ్‌జెన్ (@Amgen) తో ప్రభు త్వం ఒప్పందం చేసుకోగా, తాజా గా మాదాపూర్‌లో ఆమ్‌జెన్ ఇండి యా ఫెసిలిటీ సైట్ ను ప్రారంభిం చింది. ఆమ్‌జెన్ ఇండియా ఫెసి లిటీ సైట్‌ను ప్రారంభించిన సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్ర పంచంలో ప్రఖ్యాతిగాంచిన బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఆమ్ జెన్ తన మొట్టమొదటి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించ డం ఎంతో గర్వంగా ఉందని అన్నా రు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.
శ్రీధర్ బాబుతో కలిసి గత ఆగస్టు లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను సందర్శించిన ప్పుడు సైంటిఫిక్ ఇన్నొవేషన్, రీసె ర్చ్, బయో టెక్నాలజీ, ఫార్మా ఆవి ష్కరణలలో కంపెనీ నిబద్ధతను గమనించామని చెప్పారు.ఆమ్‌జెన్ హైదరాబాద్ రావడంతో బయోటె క్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇ న్నొవేషన్, టెక్నాలజీ హబ్‌గా న గరం మరింత బలపడిందని అన్నా రు. తెలంగాణ రాష్ట్రం లైఫ్‌సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ట్రిలి యన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంలో ఎద గడం, ప్రపంచంలో చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఆమ్‌జెన్ భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధించడా నికి అవసరమైన సహకారాన్ని అం దించడానికి తెలంగాణ కట్టుబడి ఉందని చెప్పారు. పరిశోధనా రంగంలో, నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాలు, అకడమిక్ భాగస్వామ్య రంగాల్లో ఆమ్‌జెన్ మరిన్ని పెట్టుబ డులు పెట్టాలని ముఖ్యమంత్రి కో రారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఆమ్ జెన్ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్వే, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనలర్ జెన్నిఫర్ లార్సన్ , ఆమ్‌జెన్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ డెరిక్ మిల్లర్ తో పాటు ఇతర ము ఖ్యులు ప్రసంగించారు.