–రామోజీరావు వ్యక్తికాదు, ఓ శక్తివంతమైన వ్యవస్థ
–విశాఖపట్నం లో చిత్రనగరి ఏర్పా టు చేస్తాం
— రామోజీ రావు సంస్కరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu Naidu: ప్రజా దీవెన, విజయవాడ: రామో జీరావు (Ramoji Rao) స్ఫూర్తిని భావితరాలకు అం దించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (chandra babu) పిలుపునిచ్చారు. సమాజా నికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజర య్యారు. విజయవాడ శివారు కానూరులో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంప తులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) , రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ ‘రామోజీరావు వ్యక్తికాదు, ఓ శక్తివంతమైన వ్యవస్థ అని ఏ పనిచేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారని కొనియాడారు.నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరా వు అని, మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థా యికి ఎదిగారని గుర్తు చేశారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్ వన్ గా ఎదిగారు. 1974 ఆగస్టు 10న ‘ఈనాడు’ (eenadu) పత్రిక విశాఖలో ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా ‘ఈనాడు’ అనునిత్యం ప్రజా చైత న్యం కోసం పనిచేస్తోంది. రామోజీ రావు పత్రికారంగంలో ఉండి నిరం తరం ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారు. ఎంతో మంది నటులు, కళాకారు లు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చా రు. మీడియా రంగంలో చేసిన కృషి కి అనేక అవార్డులు వచ్చాయి. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉ దాహరణ రామోజీ రావు. చరిత్రలో ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీ మాత్రమే ఉం టారు. మార్గదర్శి సంస్థను దెబ్బ తీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఏం చేసినా ఆ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీయలేక పోయారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు. రామో జీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు.
కొవిడ్ (covid)సమయంలో కూడా ప్రజలకు అండగా ఉ న్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకుంటారు. చాలా మంది పదవులు ఉంటేనే సేవ చేస్తారు. కానీ, ప్రజా చైతన్యం తో ప్రజలకు మేలైన పరిపాలన, సేవలు అందించవచ్చని నిరూ పించిన వ్యక్తి రామోజీరావు (ramoji rao). 1982 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో అధికారంలోకి వచ్చారంటే అందులో రామోజీరావు పాత్ర కీలకం. ఎన్నికష్టాలు వచ్చినా భయపడలేదు. ధైర్యంగా ఎదు ర్కొన్నారు. హైదరాబాద్ అభి వృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో ఉంది. రామోజీరావు నిరంతరం విలువల కోసం బ్రతికారు.. ప్రజల కోసం పోరాటం చేశారు. నవ్యాం ధ్రకు ఏ పేరు పెట్టాలా అని ఆలో చిస్తున్న సమయంలో రీసెర్చ్ చేసి ‘అమరావతి’ పేరును సూచించారు. ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయత. పనిచేస్తూ చనిపోవాలని ఆయన కోరుకున్నారు. చివరి రోజుల్లో అదే జరిగింది. దిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా.. అమరావతిలో రామోజీ (ramoji_ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్ అని పేరు పెడతాం.