Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమ‌తులు లేవు

–అక్రమమైతే విద్యా సంస్థల నైనా కూల్చేస్తాం
–క‌బ్జాకోరులు ఎంత‌టి వారైనా వ‌ది లేది లేదు
–ముందుగా మా పార్టీ స‌భ్యుని ఇంటినే కూల్చడమే మా నిబద్ధత

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోబోమని, ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy)తేల్చి చెప్పారు. సచివాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, ‘హైడ్రా’ (hydra) హైదరాబాద్ వరకే పరిమితమన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జా లే మా మొదటి ప్రాధాన్యం అన్నా రు. ప్రజా ప్రయోజనాలు మాకు ము ఖ్యమని తెలిపారు. చెరువులు కబ్జా చేసిన ఎవర్ని వదిలి పెట్టమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీ (Gram Panchayat) లు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ (FTL, buffer zone) లో నా కుటుంబ సభ్యు లు, బంధువులు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు.కేటీఆర్ (ktr)ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్ని కల అఫిడవిట్ లో చూపిం చారా అని ప్రశ్నించారు. చూపించ కుంటే న్యాయ విచారణ ఎదుర్కో వాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు. ప్రజాప్ర తినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. మొదటగా మా పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్ కూల్చిందన్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేప ట్టవద్దు. వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని తెలిపారు.

హ‌రీశ్, కేటిఆర్ (harish , ktr)లు ఇంటింటికి వెళ్లండి.. రైతు రుణమాఫీ 2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొ త్తానికి కడితే రుణమాఫీ అయి పో తుందన్నారు. వాటికి నిధులు కూ డా విడుదల చేశామన్నారు. బీఆ ర్ఎస్ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి రు ణమాఫీ కానీ వారి లెక్కలు సేకరిం చి కలెక్టర్ ఇవ్వండని తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు వద్దకి వెళ్ళండి అన్నారు. రుణమా ఫీ అవ్వని లెక్కలు సేకరించి కలెక్టర్ కు ఇవ్వండి తెలిపారు. నాకు ఇవ్వా ల్సిన అవసరం లేదన్నారు. రుణ మాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయకుం డా ఉన్నాడు, హరీష్ రావు (harish rao)దొంగ అని ముందే తెలుసన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని విదేశీ పర్యటనలో ఉన్నా మధ్యంతరంగా వచ్చి ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేశామని రేవంత్ రెడ్డి అన్నారు.