CMRevanthReddy : సీఎం రేవంత్ పునరుద్ఘాటన, డిసెం బర్ 9న ప్రగతిలక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరణ
CMRevanthReddy: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ:ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలన్న బృహత్తర మైన ప్రణాళికతో ముందుకు వెళు తున్న తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్య మంత్రి ఎ. రేవం త్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. తెలం గాణలో పెట్టే పె ట్టుబడులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యం లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలం గా ణ రైజింగ్ 2047 విజన్ డా క్యుమెం ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవి ష్కరించబోతున్నట్టు ఈ సందర్భం గా ముఖ్యమంత్రి పు నరుద్ఘాటించా రు.లక్ష్యసాధన దిశగా పయనిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ని లవాలని పారిశ్రామిక వేత్తలకు ఆ హ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే…
పారదర్శకమైన పరిపాలన అందిం చడానికి రాజకీయ సంకల్పం కావా లి. భవిష్యత్ తరాలకు అవకాశాల ను సృష్టించాలన్నదే మా ఆలోచన. దేశంలోనే యువ రాష్ట్రం తెలంగా ణ. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘన మైన చరిత్ర ఉంది.రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డా క్యు మెంట్-2047 రూపొందిం చాం. రాష్ట్రాన్ని భౌగోళికంగా మూ డు ప్రాంతాలు, కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభ జన చేశాం. కోర్ అర్బన్ ప్రాంతంలో కోటి మంది నివసిస్తు న్నారు. కోర్ అర్బన్ ప్రాంతం సేవా రంగానికి వినియోగించాలని ఈ ప్రాం తంలోని కాలుష్య కారక పరిశ్రమలను నగ రం వెలుపలికి తరలి స్తున్నాం.
సెమీ అర్బన్ ప్రాంతాన్ని తయారీ రంగం కోసం ప్రత్యేక జోన్‌గా (మా న్యుఫాక్చర్) నిర్ణయించాం. తెలంగా ణలో అభివృద్ధికి తగినట్లు 70 కి. మీ ఉన్న మెట్రోను 150 కి.మీ పొడి గించాలని నిర్ణయించాం. ప్రస్తుతం అయిదు లక్షల మంది మెట్రోలో ప యనిస్తున్నారు. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సబర్మతీ తీరంలా మూసీని మారు స్తాం. అందుకు మూసీ నది పునరు జ్జీవంపై దృష్టి సారించాం. హైదరా బాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మా ణం చేప డుతున్నాం. 2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయి.
అందుకే ఈవీలకు రాయితీలు ప్రక టించాం. రాష్ట్ర అవసరాలకు తగిన ట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, భ విష్యత్ అవసరాలకు తగినట్లు భా రత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్ర ణాళికలు సిద్ధం చేశాం. విమానాశ్ర యం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ (future City) అనుసంధానత కల్పిస్తాం. తెలంగా ణలో సేంద్రియ పంటలు పండుతు న్నాయి. ప్రపంచ దేశాలను పట్టి పీ డిస్తున్న మాదక ద్రవ్యాలను తెలం గాణలో కఠినంగా నియంత్రిస్తు న్నాం. వాటి నిర్మూ లనలో తెలంగా ణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణం గా విజ్ఞానంతో పాటు నైపుణ్యం అ వసరం. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏ ర్పాటు చేశాం. తమ ప్ర భుత్వం మ హాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరి స్తోంది. స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. స్పో ర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చ ర్యం కలుగుతుంది. ఒలింపిక్స్ పత కాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండి యా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పా టు చేశాం.తెలంగాణకు ఓడ రేవు లేనందున, మచిలీపట్నం ఓడ రేవు తో అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, దాని కి సమాంతరంగా రైల్వే లైన్ మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరు తున్నాం.
బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణ నుంచి జరుగుతోంది. వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ప్రస్తు తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసు కుంటున్న నిర్ణయాల ఆ దేశానికే ఎ క్కువగా నష్టం చేకూర్చేలా ఉన్నా యని వివరించారు.ఈ సందర్భంగా జరిగిన చర్చా గోష్టిలో PAFI అధ్య క్షుడు చేతన్ కృష్ణ, సెల్ కాన్ గ్రూప్ చైర్మన్ గురుస్వామి నాయుడు, గో ద్రేజ్ కార్పొరేట్ ఎఫైర్స్ గ్రూప్ ప్రెసి డెంట్ రాకేష్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి బిజినెస్ స్టాండర్డ్ ఎ డిటోరియల్ డైరెక్టర్ అశోక్ భట్టా చార్య మాడ రేటర్‌గా వ్యవహరించా రు.