Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Election Officer: వ్యయ పరిశీలకునికి స్వాగతం పలికిన కలెక్టర్

లోక సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తన చాంబర్లో పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.

ప్రజా దీవెన నల్గొండ: లోక సభ ఎన్నికల(Lok sabha elections) వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తన చాంబర్లో పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె గురువారం ప్రారంభమైన లోకసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్, తదిత అంశాలపై చర్చించారు.

అంతకుముందు రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఎన్నికల పరిశీలకులు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్, డిప్యూటీఆర్ఓ నటరాజ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవికుమార్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మితో నామినేషన్ల కార్యక్రమాన్ని పరిశీలించారు. అంతేకాక వివిధ రకాల ఫారాలు, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ ఉన్నారు.

Collector welcome Expenditure Inspector