C vigil app: పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం ‘సి విజిల్’
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన పిర్యాదులు వెంటనే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పి చందన దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆప్ ద్వారా పిర్యాదులు చేయవచ్చు
జిల్లా ఎస్పీ చందనా దీప్త
ప్రజా దివేన నల్లగొండ క్రైమ్: పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన పిర్యాదులు వెంటనే సి-విజిల్ యాప్(C vigil app) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పి చందన దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే ప్రజలు సి-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
బాధ్యతా యుత పౌరుని చేతిలో బ్రహ్మాసం సి-విజిల్ యాప్(C vigil app) అని, ఇందులో ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, నగదు, వస్తువులు, మద్యం ద్రవ్యాలు పంపిణీ చేయడం, ప్రజల ఆస్తులను అనుమతి లేకుండా ప్రచారాలకు వినియోగించడం, కుల మత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఓటర్లను రవాణా, అసత్య వార్తల ప్రసారం, చెల్లింపు వార్తలు ప్రచురణ, మారణాయుధాలు కలిగి ఉండడం, ఇతర ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులను చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలు, వీడియో లను వెంటనే సి-విజి ల్ లో అప్లోడ్ చేయడంతో నిర్ణీత కాల వ్యవధిలో ఫ్లాయింగ్ స్క్వాడ్ టీం(Flying Squad Team) ఆ ప్రాంతా నికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
Complaints through C vigil app in Elections