–సెంట్రింగ్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా 40 వ వర్ధంతి
Puchchalapalli Sundarayya :ప్రజాదీవెన నల్గొండ టౌన్ : కార్మిక కర్షక పీడిత ప్రజల పెన్నిధి సమ సమాజ స్థాపన లక్ష్యంగా పనిచేసిన మహా నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. సోమవారం సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ కార్యాలయంలో 40వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేదలు దోపిడీకి గురవుతున్న తీరును పరిశీలించి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించిన నాయకుడు అని కొనియాడారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా ఆనాడు సహభక్తి భోజనాలు ఏర్పాటు చేసి మానవులంతా సమానమే అని చాటినాడని అన్నారు. పేదల కోసం చౌక దుకాణాలు నడిపిన మహానేత అని ,అసెంబ్లీకి పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లి నిరాడంబర జీవితాన్ని గడిపిన సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం అని అన్నారు. వారి స్ఫూర్తితో శ్రమకు తగ్గ ఫలితం, సమాన పనికి సమాన వేతనం దక్కేవరకు కూలి,భూమి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సుందరయ్య సొసైటీ గౌరవాధ్యక్షులు బచ్చలకూరి గురువయ్య, అధ్యక్షులు నోముల యాదయ్య, కార్యదర్శి దేవరంపల్లి వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు బొజ్జ సైదులు, మన్నె శంకర్, కో ఆప్షన్ సభ్యులు ఆమంచి మధు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోళ్ళు రవీంద్ర కుమార్, సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ సభ్యులు రాచకొండ యాదగిరి, ముక్కామల ముత్తయ్య, మేకల నాగరాజు పాల్గొన్నారు.