Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉ ద్ఘాటన,ఏఐటెక్నాలజీకి హైదరాబా ద్ గ్లోబల్ సెంటర్,యాప్ డిజైన్ లీ డర్
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. UM O ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు వా రం హైటెక్ సిటీ లోని ట్రైడెంట్ హో టల్లో “u x ఇండియా 25″ పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషన ల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీ రియన్స్ & ప్రోడక్ట్ డిజైన్” ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లాం ఛనంగా ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
హైదరాబాద్ నగరం ఎటువంటి టె క్నాలజీ నైనా అందిపుచ్చుకొని లీడ ర్ గా ఎదుగుతుంది అన్నారు. Ai టెక్నాలజీకి హైదరాబాద్ మహా నగ రాన్ని గ్లోబల్ సెంటర్ గా నిలబె ట్టేం దుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ పట్టుదలతో ఉందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులు హైద రాబాద్ వాతావరణం, సంస్కృతి, కళలు, ఆహారం అన్నిటిని ఆస్వా దించాలని, ప్రతినిధులు ఈ రాష్ట్రం లో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృ ష్టికి తీసుకురావాలని ఈ సందర్భం గా డిప్యూటీ సీఎం ప్రతినిధులను కోరారు.
డిజైన్ అనేది కేవలం అందానికి కా దు అది సామాజిక మార్పునకు ఆ యుధం కావాలని ఉద్బోధ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలి పారు. హైదరాబాదును ప్రపంచ డి జైన్ క్యాపిటల్ గా మార్చడానికి కలి సి పని చేద్దామని ప్రతినిధులకు డి ప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబా ద్ చరిత్రలో ఒక మలుపురాయ న్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తును పరిపుష్టం చేయడం లో, మరో అడుగు ముందుకు వేయ డంలో కీలక పాత్ర పోషిస్తుందని తా ను భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మన జీవి తాల్లో అనివార్యమైనవి, కానీ ఒక యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే అది విజయవంతం అవుతుంది అ న్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజి టల్ ఇంక్లూజన్ను ప్రోత్సహిస్తుంది, TS- IPASS వంటి పాలసీల ద్వారా స్టార్టప్ లకు చేయూతనిస్తుంది అని తెలిపారు.భారతదేశంలో యూపీఐ వంటి యాప్ లు సరళంగా రూపొం దించడంతో పెద్ద విజయం సాధిం చాయన్నారు. ప్రాంతీయ భాషల్లో నూ యాప్ లు రూపొందించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర జలు కూడా సులభంగా ఉప యో గించుకునే అవకాశం ఉంటుంద న్నారు.
*త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్* …హైదరాబాద్ ను గ్లో బల్ డిజైన్ హబ్ గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే “సెంటర్ ఆ ఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్”ను ప్రా రం భించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు చెప్పారు. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ లాంటి సంస్థల ద్వారా తె లగాణ ను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్ర ణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠా త్మకంగా ఏర్పాటు చేయబోతున్న “ఏఐ ఇన్నోవేషన్ హబ్ “లో డిజై నింగ్ కు పెద్దపీట వేస్తున్నామ న్నారు.
డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే… ఆది యూజర్ ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్ లేదా వెబ్ సైట్ మనుగడ సాధ్యమన్నారు. ఈ ప్రక్రియలో ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలు గా చూడాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకు ర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నా రు.