Did you know that the assistance to farmers has increased: రైతుకు సాయం పెరిగింది తెలుసా
--భూమి పుత్రులకు కేంద్రం మరింత వెన్నుదన్ను --పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపుకు కసరత్తు --పార్లమెంటు ఎన్నికల లోపే అమలుకు ప్రణాళిక
రైతుకు సాయం పెరిగింది తెలుసా
–భూమి పుత్రులకు కేంద్రం మరింత వెన్నుదన్ను
–పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపుకు కసరత్తు
–పార్లమెంటు ఎన్నికల లోపే అమలుకు ప్రణాళిక
ప్రజా దీవెన/హైదరాబాద్ : కేంద్రలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు ( NDA government to support farmers more) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రైతన్నకు ప్రస్తుతం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని మరింతగా పెంచి అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో రైతులకు అతిత్వరలోనే శుభవార్త అందించనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది.
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతుల మద్దతు మరింతగా కూడగట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ( Modi government’s efforts to garner more support from farmers) ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు మూడు విడుతల్లో ఏటా రూ.6 వేలు ఖాతాల్లో జమ చేస్తుండగా ఈ మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం 2018 లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు ( To be implemented before the central government elections) ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
కొత్త నిర్ణయం తర్వాతే నిధుల విడుదల…. ప్రస్తుతం ఏడాదికి రూ. 6 వేలు అందిస్తున్న మోడీ ప్రభుత్వం (Currently Rs. 6 thousand is provided by the Modi government) పథకం అమల్లోకి వచ్చాక గత ఏడాది నవంబర్ లో 15వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో 16వ విడతగా నిధులు విడుదల చేసే అవకాశం ( Funds are likely to be released as 16th installment in February or March this year) ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన తర్వాతే నిధులు విడుదల చేసి ఆ మేరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవ కాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏది ఏమైనా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఆర్థిక సహాయం చేస్తున్నడం పట్ల రైతులు రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న పెట్టుబడి సాయాన్ని మరింతగా పెంచి ఇవ్వాలన్న ఆలోచన పట్ల రైతుల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.