Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DRUGS FREE: డ్రగ్స్ రహిత కోదాడ గా తీర్చిదిద్దుదాం

**మాదకద్రవ్యాలకు బానిసత్వంతో యువత జీవితాన్ని కోల్పోతుంది

DRUGS FREE: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణాన్ని డ్రగ్సు రహిత (Drug free)పట్టణంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి (Nalamadha Padmavathi Reddy is a legislator from Kodada) పిలుపునిచ్చారు ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కోదాడ సబ్ పోలీస్ వారి కోదాడ డిఎస్పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో వ మాదక ద్రవ్యాలను తీసుకోవడం వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై అవగాహన ర్యాలీ నిర్వ హించడం జరిగింది.

కోదాడ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (Govt Boys High School) నుండి కోదాడ పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితం లో 15 నుండి 35 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైన దని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదకద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశ నం అవుతుందని అన్నారు యువత కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. జిల్లాలో మత్తుమందులు అన్నవి కనపడకూడదని చెప్పారు. ఇందుకుగానుఅన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. దీంతో కొన్ని మాధ్యమాల ద్వారా పిల్లలు చెడు వైపుకు వెళ్తూ మత్తుకు బానిస అవుతున్నారని, పిల్లలు ఏం చేస్తున్నారో రోజువారి పరిశీలన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని గుర్తు చేశారు. పిల్లలు మత్తుకు బానిస కాకుండా మొదట తల్లిదండ్రుల్లో అవగాహనరావాలని వారి పర్యవేక్షణచేయకపోవడం (Lack of supervision) వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని, అన్నారు.

కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా మాదకద్రవ్యాలు అమ్మిన, సరఫరా చేసిన వెంటనే పోలీస్ శాఖకు (POLCIE OFFICERS) తెలియజేయాలని, మాదకద్రవ్యాలు అమ్మిన, సప్లై చేసిన ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. కోదాడ సబ్ పోలీస్ శాఖ (Kodada Sub Police Station) వారిచే కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ ఆర్డీవో సూర్యనారాయణ తాసిల్దార్ స్వామి గౌడ్ కోదాడ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు కోదాడ జడ్పిటిసి మందలపు కృష్ణకుమారి శేషు కోదాడ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ దశరథ ఎంఈఓ సలీం షరీఫ్ ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వేముల వెంకటేశ్వర్లు కోదాడ టౌన్ రూరల్ సిఐలు రాము రజిత రెడ్డి కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఎస్ఐలు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులు స్వచ్ఛంద సంస్థలు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలుఇంజనీరింగ్ కళాశాలలు పాఠశాలల విద్యార్థులు పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు.